2వ రోజు బింబిసార బీభత్సం.. ప్రాఫిట్స్ లోకి ఎంట్రీ!

Update: 2022-08-07 09:30 GMT
మొత్తానికి కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాతో అనుకున్నట్లుగానే బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసుకునే దిశగా ముందుకు సాగుతున్నాడు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ మొదటి రోజే ఊహించిన విధంగా ఓపెనింగ్స్ అందుకుంది. ఇక రెండవ రోజు కూడా అదే తరహాలో కలెక్షన్స్ అందుకున్న బింబిసార సినిమా మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో అయితే బ్రేక్ ఈవెన్ టార్గెట్ కు దగ్గరైంది.

దాదాపు కొన్ని ఏటియాల్లో టార్గెట్ ను పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే గతంలో ఎప్పుడు లేని విధంగా చాలా వేగంగా ఈ సినిమా పెట్టిన పెట్టుబడిని వెనక్కి తెస్తోంది. అదే విధంగా బయ్యర్లకు మంచి లాభాలను అందిస్తోంది. ముఖ్యంగా నైజంలో రెండవ రోజు ఈ సినిమా 1.77 కోట్ల వసూళ్లను అందుకుంది.

ఇక సీడెడ్ లో 95 లక్షలు, ఉత్తరాంధ్రలో 65 లక్షలు, ఈస్ట్ గోదావరిలో 27 లక్షలు వెస్ట్ గోదావరిలో 19 లక్షలు గుంటూరులో 32 లక్షలు కృష్ణ లో 25 లక్షలు నెల్లూరులో రెండు లక్షల తో ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని 4.52 కోట్ల షేర్ వసూళ్లను సొంతం చేసుకుంది. ఇక మొత్తంగా రెండు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే సినిమా 10.82 కోట్ల షేర్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది.

అంటే ఈ లెక్కతో సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పెట్టిన పెట్టుబడిని వెనక్కి తీసుకు వచ్చినట్లే అనే చెబుతున్నారు. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో రెండు రోజుల్లో 50 లక్షలు షేర్ ను అందుకున్న ఈ సినిమా ఓవర్సీస్ లో కోటికి పైగానే వసూళ్లను అందుకుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే టోటల్ గా 12.37 కోట్లు వచ్చాయి. ఈ లెక్కలతో చిత్ర నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక మూడవ రోజు కూడా ఇదే రేంజ్ లో కలెక్షన్స్ వస్తే ప్రాఫిట్స్ లెక్కలతో బిజీ అవుతారు. మరి సినిమా మొత్తంగా పెట్టిన పెట్టుబడికి ఏ తరహాలో ప్రాఫిట్ అందిస్తుందో చూడాలి.
Tags:    

Similar News