టాప్ హీరో సరసన నటించాలంటే.. ఎన్నో ఎంట్రన్స్ టెస్టులు పాసవ్వాల్సి ఉంటుంది. మరెంతో రేంజ్ పెంచుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాతగానీ.. అగ్రహీరోతో జోడీ కట్టే అవకాశం దక్కదు చాలా మంది హీరోయిన్లకు! కానీ.. వచ్చీ రావడంతోనే టాప్ స్టార్ తో సినిమా చేయడమే కాకుండా.. బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది సోయగాల ఝరి.. అంజలా జవేరి!
ఈ బ్యూటీ తొలి చిత్రంలో విక్టరీ వెంకటేష్ సరసన నటించింది. ‘ప్రేమించుకుందాం రా’ అంటూ వీళ్లిద్దరూ చేసిన సందడి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. అన్ని వర్గాలనూ ఆకట్టుకున్న ఈ మూవీ.. బంపర్ హిట్ గా నిలిచింది. ఇంకేముందీ..? ఇండస్ట్రీ చూపు మొత్తం ఈ బ్యూటీపైనే పడింది.
ఆ వెంటనే మెగాస్టార్ చిరంజీవి సరసన ఛాన్స్ కొట్టేసింది. వీరి కాంబోలో వచ్చిన ‘చూడాలని వుంది’ చిత్రం భారీ సక్సెస్ సాధించింది. దీంతో.. అంజలా ఝవేరి రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. బ్యాక్ టూ బ్యాక్ వరుస విజయాలు దక్కడంతో ఈ బ్యూటీకి అవకాశాలు వరుసకట్టాయి. బాలయ్య సరసన ‘సమరసింహారెడ్డి’, నాగార్జునతో ‘రావోయి చందమామ’ సినిమాల్లో నటించి.. టాప్ హీరోయిన్ గా వెలిగిపోయింది.
ఆ తర్వాత మోడల్ తరుణ్ అరోరాను పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైంది. మళ్లీ చాలా కాలం తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్’ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటించింది. అయితే.. పెళ్లి చేసుకొని ఎన్నో సంవత్సరాలు అవుతున్నప్పటికీ.. ఇప్పటికీ పిల్లల్ని కనలేదు. ఇకపై కనే ఉద్దేశం కూడా లేదట.
ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు ఆమె భర్త తరుణ్ అరోరా. తన భార్య అంజలి తనకు పాప వంటిదని, ఆమె ఉండగా పిల్లల అవసరం లేదని చెప్పడం విశేషం. తరుణ్ అరోరా కూడా తెలుగు వారికి సుపరిచితుడే. చిరంజీవి రీఎంట్రీ మూవీ ఖైదీనెం.150లో కార్పొరేట్ విలన్ గా కనిపించింది అతనే. ఆ తర్వాత కూడా పలు సినిమాల్లో నటించాడు.
తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా దూరమైనా.. ప్రత్యేక పాత్రల్లో అప్పుడప్పుడూ తళుక్కున మెరుస్తోంది. ఈ మెరుపులు ఇలాగే కొనసాగాలని, తన నటనతో మనల్ని అలరించాలని కోరుకుందాం. ఇలాంటి బర్త్ డేలు ఆమె మరెన్నో జరుపుకోవాలని ఆశిద్దాం. అందాల అంజలికి ‘‘తుపాకీ’’ తరపున ప్రత్యేకమైన పుట్టిన రోజు శుభాకాంక్షలు.