పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 'వకీల్ సాబ్' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు - శిరీష్ నిర్మిస్తున్నారు. ఇది హిందీలో ఘన విజయం సాధించిన 'పింక్' చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతోంది. పవన్ రీ ఎంట్రీ మూవీగా వస్తున్న ఈ చిత్రంలో తొలిసారిగా లాయర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్ లో పవర్ స్టార్ లాయర్ సాబ్ లుక్ ఆకట్టుకుంది. కోవిడ్ నేపథ్యంలో ఇటీవలే ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. పవన్ కూడా 'వకీల్ సాబ్' షూటింగ్ లో భాగంగా నల్ల కోటు ధరించి కనిపిస్తున్నాడు. అయితే ఈ మధ్య ఇండస్ట్రీకి నల్ల కోటు అచ్చి రావడం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
టాలీవుడ్ లో ఇటీవల నల్ల కోటు ధరించి అంటే లాయర్ గెటెప్స్ వేసిన హీరోలంతా ఫ్లాపులు చవి చూశారు. 'తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్' అనే కామెడీ సినిమాలో యువ హీరో సందీప్ కిషన్ లాయర్ పాత్రలో నటించాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అలానే కమెడియన్ సప్తగిరి హీరోగా నటించిన 'సప్తగిరి ఎల్ ఎల్ బి' సినిమా కూడా ప్లాప్ గా మిగిలిపోయింది. ఇది 'జాలీ ఎల్ ఎల్ బి' అనే హిందీ హిట్ సినిమాకి రీమేక్ గా వచ్చింది. అక్కడ సక్సెస్ అయిన సినిమా ఇక్కడ ఫెయిల్ అయింది. ఇక యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ లా స్టూడెంట్ గా నటించిన 'కేశవ' సినిమా కూడా నిరాశపరిచింది. ఇలా చెప్పుకుంటూ పోతే నల్ల కోటు వేసుకున్న టాలీవుడ్ హీరోల్లో చాలా మంది ఫెయిల్ అయ్యారు. అప్పట్లో లాయర్ సినిమాలు హిట్ అయినా ఈ మధ్య మాత్రం పెద్దగా సక్సెస్ అవలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' కోసం నల్ల కోటు ధరిస్తున్నాడు. మరి ఇప్పుడు పవర్ స్టార్ ఈ బ్యాడ్ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తాడేమో చూడాలి.