ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఇటీవల కాలంలో తరచూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. బాలీవుడ్ నుంచి అప్ గ్రేడ్ అయి ప్రస్తుతం హాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఈ బ్యూటీ.. తనకంటే చిన్నోడి ప్రేమలో పీకల్లోతుల్లో మునిగిపోయినట్లు చెప్పటం తెలిసిందే.
తనతో ఇండియాకు తీసుకొచ్చిన ఈ కుర్ర ప్రియుడు పెద్ద ముదురుకేసని.. ఇప్పటికే పలువురు భామలతో ప్రేమాయణం నడిపి కటీఫ్ చెప్పిన వైనం కథలు కథలుగా చెబుతున్నారు. అయినా కూడా ప్రియాంకు అతగాడే నచ్చటం.. అతడితో కలిసి చక్కర్లు కొడుతున్న వైనంపై మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వస్తున్న వేళ.. ఇందుకు భిన్నమైన అంశంలో ఆమె పేరు బయటకు వచ్చింది.
పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన ప్రియాంక చోప్రా.. ముంబయిలోని ఒక వాణిజ్య సముదాయంలో అక్రమ నిర్మాణానికి పాల్పడ్డారంటూ తాజాగా బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు జారీ చేసింది. ముంబయిలోని అంథేరిలో ఒఫివారా వద్దనున్న కమర్షియల్ కాంప్లెక్స్ లో అనుమతి పొందిన ప్లాన్ కు భిన్నంగా నిర్మాణం జరిపినట్లుగా ఐదుగురు ప్రియాంక మీద ఫిర్యాదు చేశారు. దీంతో.. బృహన్ మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన అధికారులు తనిఖీలు చేపట్టారు.
వాస్తు కోసం అక్రమ నిర్మాణం చేపట్టినట్లుగా తేలింది. దీంతో.. మున్సిపల్ అధికారులు ప్రియాంకకు నోటీసులు జారీ చేశారు. 2013 జూన్ లో అనుమతి పొందిన ప్లాన్ కు భిన్నంగా నిర్మాణాలు చేసినట్లుగా తేలటంతో ఆ నిర్మాణాల్ని తొలగించాలని అధికారులుఆదేశాలు జారీ చేశారు. దీనికి ముందుగా ప్రియాంకకు నోటీసులు జారీ చేసిన అధికారులు తామిచ్చిన గడుపు లోపు స్పందించి చర్యలు తీసుకోవాలని.. లేదంటే కూల్చివేస్తామని వార్నింగ్ ఇవ్వటం గమనార్హం. మరి.. ఈ ఎపిసోడ్‌పై ప్రియాంక ఏమని రియాక్ట్ అవుతారో చూడాలి.