సర్దార్ గబ్బర్ సింగ్ కోసం దర్శకుడు సంపత్ నంది ఏడాదికిపైగా వర్క్ చేసి.. ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. సర్దార్ నుంచి తప్పుకున్న తర్వాత మాస్ మహరాజ్ రవితేజతో బెంగాల్ టైగర్ చేసి సక్సెస్ కొట్టాడు ఈ దర్శకుడు. సంపత్ నంది బయటకొచ్చిన తర్వాత.. సర్దార్ ప్రాజెక్టును హ్యాండిల్ చేసిన వ్యక్తి కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీ. అయితే.. పవర్ తో రవితేజకి హిట్ ఇచ్చిన బాబీ.. సర్దార్ తో పవర్ స్టార్ కి మాత్రం సక్సెస్ అందించలేకపోయాడు. సర్దార్ ఫ్లాప్ తర్వాత చాలాకాలం అసలు కనిపించనే లేదు ఈ దర్శకుడు.
ఇప్పుడు బాబీ కూడా రవితేజ దగ్గరకే చేరుతున్నాడని తెలుస్తోంది. వరుస పరాజయాలతో డీలా పడ్డ స్టార్ రైటర్ కోన వెంకట్.. పవన్ తో ఫ్లాప్ తీసి బోల్తా కొట్టిన బాబీలు ఇద్దరూ కలిసి.. రవితేజతో నెక్ట్స్ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. గత ఆరు నెలలుగా కొత్త సినిమా ప్రారంభించడంలో విఫలమవుతున్న మాస్ మహరాజ్ కూడా.. వీళ్లిద్దరూ కలిసి చెప్పిన లైన్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు సమాచారం. సహజంగానే రైటర్ అయిన బాబీ.. కోనతో కలిసి రవితేజకు సూటయ్యే అద్భుతమైన స్టోరీని సిద్ధం చేసినట్లు చెబుతున్నారు.
ప్రస్తుతం రవితేజ ఓ తమిళ్ రీమేక్ పై కూడా కన్నేశాడనే టాక్ ఉంది కానీ.. ముందు డైరెక్ట్ మూవీతోనే ప్రేక్షకుల ముందుకు రావాలని యోచిస్తున్నాడట. బాబీతో ప్రాజెక్టు విషయంలో రవితేజ ఇంట్రెస్ట్ చూపిస్తుండడంతో.. త్వరలో ఇది పట్టాలెక్కే ఛాన్సులు ఉన్నాయంటున్నారు. ఏంటో.. పవన్ దగ్గర తేడా వచ్చిన వాళ్లంతా రవితేజ దగ్గరకే చేరడం ఆశ్చర్యంగా అనిపించడం లేదూ!