ఇద్ద‌రు బిడ్డ‌ల త‌ల్లి అయ్యాకా ఇంకా వివాదాల‌మ‌య‌మే!

Update: 2021-08-11 07:08 GMT
అంద‌రూ వెళ్లే దారిలో వెళితే అందులో కిక్కేం ఉంటుంది. అందుకే కొంద‌రు త‌మ‌కంటూ ఒక కొత్త‌ దారిని వెతుక్కుంటారు. మంద‌లో ఒక‌రిగా కాకుండా మంద‌ను న‌డిపే ఒక‌రిగా ఉంటారు! ఆ కోవ‌కే చెందుతుంది క‌రీనా. బెబో క‌రీనా క‌పూర్ వ్య‌వ‌హార శైలి రొటీన్ కు భిన్నం. తాను అంద‌రూ వెళ్లే దారిలో న‌డ‌వ‌దు. త‌న‌కంటూ ఓ కొత్త మార్గాన్ని వేసుకుని ఆ బాట‌లోనే ప్ర‌యాణం చేస్తుంది. ఆ దారిలో ముళ్లు ఉన్నాయ‌ని తెలిసినా చీల్చుకుంటూ ముందుకెళ్ల‌డం ఆమెకు ఓ హాబీ. బెబో గ‌త‌ విష‌యాల్లో కి వెళ్తే అన్ని వివాదాలు..విమ‌ర్శ‌లు...అప‌నింద‌లే.. కెరీర్ ఆరంభంలో షాహిద్ కపూర్ తో ప్రేమాయ‌ణం పీక్స్ లో సాగించింది. అప్ప‌ట్లో ఈ జంట‌కు సంబంధించిన ప‌బ్లిక్ ఇంటిమేట్ వీడియో ఓ రేంజ్ లో వైరల్ అయింది. ఘాడంగా ఇరువురు అద‌ర‌తాంబూలం అందుకుంటున్న వీడియోతో అగ్గిరాజేసారు.

క‌ట్ చేస్తే ఆ ప్రేమ పెళ్లి వ‌ర‌కూ వెళ్ల‌లేదు. ఆ త‌ర్వాత హృతిక్ రోష‌న్ తోనూ బెబో కొన్నాళ్లు డేటింగ్ చేసింద‌ని గుస‌గుస‌లు వినిపించాయి. ఇద్ద‌రినీ క‌భీ `కుషీ క‌భీ మ‌మ్` చిత్రం ఒక‌టి చేసింద‌ని అప్ప‌ట్లో సంచ‌ల‌న క‌థ‌నాలొచ్చాయి. కానీ ఆ వార్త‌ల‌ను క‌రీనా ఖండించింది. పెళ్లైన వ్య‌క్తిని నేను పెళ్లి చేసుకోవ‌డం ఏమిటో అంటూ ఆ రూమ‌ర్ల‌కు బ్రేక్ వేసింది. ఆ త‌ర్వాత పెళ్లైన సైఫ్ అలీఖాన్ ని పెళ్లి చేసుకుంది. కొన్నాళ్ల పాటు డీప్ ల‌వ్ అనంత‌రం ఇద్ద‌రు దాంప‌త్య జీవితంలోకి అడుగు పెట్టారు. ఇక్క‌డితో క‌రీనా ఏఫైర్ల‌కు పుల్ స్టాప్ ప‌డింది. అయితే ఆ త‌ర్వాత కులాల్ని.. మ‌తాల్ని కెలుకుతూ వివాదాల‌తో అంట‌కాగింది. సైఫ్-కరీనాకు పుట్టిన మొద‌టి సంతానానికి తైమూర్ అని పేరు పెట్టింది.

ఈ పేరు పై వివాదాలెన్నో. భార‌త‌దేశంపై దండెత్తిన ముస్లీం రాజు పేరు పెట్ట‌డమేమిటో అంటూ సోష‌ల్ మీడియాలో జ‌నాలు దుమ్మెత్తిపోసారు. ఆ స‌మ‌యంలో క‌రీనా కామ్ గా ఉండ‌టంతో వివాదం స‌ద్దుమ‌ణిగింది. ఆ త‌ర్వాత రెండ‌వ సారి గ‌ర్భం దాల్చిన త‌ర్వాత ప్రెగ్నెన్సీ క్ష‌ణాల్ని `ప్రెగ్నెన్సీ బైబిల్` పేరుతో ఓ పుస్త‌కాన్ని రిలీజ్ చేసింది. ఆ పుస్త‌కాన్ని మూడ‌వ బిడ్డ‌గా వ‌ర్ణించింది. దీంతో మైనార్టీలంతా భ‌గ్గుమ‌న్నారు. క‌రీనాకు మ‌తి చెడి ఇలా ప్ర‌వ‌ర్తిస్తుందా అంటూ క్రిస్టియ‌న్లంతా మండిప‌డ్డారు. ప‌విత్ర బైబిల్ ని అప‌విత్రం చేసింద‌న్న ఆపవాద‌ను మూట‌గ‌ట్టుకుంది. ఇక రెండ‌వ కుమారుడికి జాహంగీర్ అని పేరు పెట్టింది. ఈ పేరు భార‌తీయ సంస్కృతి విరుద్దం అంటూ ఓ వ‌ర్గం తీవ్రంగా ఖండించింది.

సిక్కు ఐదవ గురు అర్జున్ ని చంపిన జ‌హంగీర్ పేరు పెట్ట‌డం ఏమిటో అంటూ ముంబై స‌హా సిక్కు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళ‌ను చెల‌రేగాయి. వీట‌న్నింటికంటే ముందు గ్లోబ‌ర్ స్టార్ ప్రియాంక చోప్రా...బిపాసా బ‌సుతో తీవ్ర స్థాయిలో విబేధాలు వ‌చ్చాయి క‌రీనాకి. కాఫీ విత్ క‌ర‌ణ్ షో లో పీసీ మాట్లాడిన తీరుపై క‌రీనా మండిపడింది. కౌంట‌ర్ గా పీసీ సైఫ్ ..తాను ఒకే ప్రాంతం వాళ్ల‌మ‌ని కౌంట‌ర్ ఇచ్చింది. ఇక `అజ్న‌బీ` షూటింగ్ స‌మ‌యంలో బిప్స్ తో వివాదం మ‌రో లెవ‌ల్లో సాగింది. బిపాసా రంగును బ్లాక్ అంటూ కామెంట్ చేసి ర‌చ్చ చేసింది. దీంతో బిప్స్ కూడా అదే స్థాయిలో కౌంట‌ర్ ఎటాక్ చేసింది. మొత్తానికి క‌రీనా కెరీర్ మొత్తం చూసుకుంటే వివాదాలు..విమ‌ర్శ‌లు చిర్రుబుర్రులే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. ఇద్ద‌రు బిడ్డ‌ల‌కు మామ్ అయినా ఇంకా అదే దారిలో ఉన్నారు బెబో మ్యాడ‌మ్.




Tags:    

Similar News