హీరోలు ఎక్కడో ఉండరు. మన మధ్యనే ఉంటారు. కష్టపడటం.. అనుకున్న లక్ష్యం దిశగా ప్రయత్నాలు చేయటం.. ఎదురుదెబ్బల్ని లెక్క చేయకుండా.. అనుకున్నది సాధించేంతవరకు శ్రమిస్తూ ఉండటమే విజయానికి గమ్యస్థానంగా చెప్పాలి. వీటన్నింటికి కాస్తంత లక్ కూడా తోడైతే.. మిగిలిన వారికి భిన్నంగా ఎక్కడికో వెళ్లే పరిస్థితి. మిగిలిన రంగాల సంగతి ఎలా ఉన్నా.. చిత్ర పరిశ్రమలో పేరు ప్రఖ్యాతులకు మాత్రం లక్ చాలా కీ రోల్ ప్లే చేస్తుందని చెప్పక తప్పదు. టాలెంట్ ఉన్నోళ్లు ఎందరో ఉండొచ్చు. కానీ.. అవకాశాలు మాత్రం కొందరికే వస్తుంటాయి. వాటిల్లోనూ ప్రేక్షక ఆదరణ అంత సామాన్యమైన విషయం కాదు.
స్టార్ హీరోల మాదిరి కండలు తిరిగిన బాడీ లేకున్నా.. మిగిలిన వారిలా అందంగా.. ఆకర్షణీయంగా లేకున్నా.. అరగడుల ఎత్తు లేకున్నా.. పక్కింటి కుర్రాడిలా.. మన మధ్యలో ఉండే వాడి మాదిరి ఉండటమే అతనికి కలిసి వచ్చింది. అతడే.. బాలీవుడ్ హీరోల్లో ఒకరు రాజ్ కుమార్ రావు. సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఇతగాడు.. బాలీవుడ్ విలక్షణ హీరోల్లో ఒకడిగా చెప్పాలి.
ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేనప్పటికి టాలెంట్ ను పెట్టుబడిగా పెట్టుకొని.. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇప్పుడు తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సొంతం చేసుకున్న నటుడిగా చెప్పాలి. ఇప్పుడంటే సూపర్ హీరో కానీ.. అంతకు ముందంతా సాదాసీదా జీవితం. తన లైఫ్ లో పడిన కష్టాల గురించి.. అప్పట్లో తాను చేసిన పనుల గురించి ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. ఇప్పుడు ఎలాంటి డ్రెస్ కావాలన్నా నిమిషాల్లో అతని ముందు వచ్చి వాలుతుంది. కానీ.. కొన్నేళ్ల క్రితం చక్కటి కోట్ వేసుకోవటానికి అవసరమైన డబ్బుల్లేక తాను చేసిన పనిని చెప్పుకొచ్చాడు రాజ్ కుమార్ రావు.
తాను పదో తరగతి చదువుతున్నప్పుడు ఆ ఏడాది పూర్తైన సందర్భంగా స్కూల్లో ఫేర్ వెల్ పార్టీ ఏర్పాటు చేశారని.. అప్పట్లో తమ ఇంట్లో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉండేవాళ్లమన్నారు. కానీ.. మంచి డ్రెస్ వేసుకోవాలన్న ఆలోచన ఉండేదని.. కానీ చేతిలో డబ్బుల్లేవన్నారు. ‘ఆ పార్టీలో నా స్నేహితులతో కలిసి ఒక పాటకు డ్యాన్స్ కంపోజ్ చేశాం. దీంతో.. అదిరే డ్రెస్ కోసం ఢిల్లీలోని చోర్ బజార్ కు వెళ్లి రూ.100లకు ఒక జాకెట్ కొన్నా. రూ.15లతో ఒక చైన్ కొని మెడలో వేసుకున్నా. స్టేజ్ మీద డ్యాన్స్ చేశా’ అంటూ తన గతాన్ని గుర్తు చేసుకున్నారు. విజేతలు ఎప్పుడూ ఉత్తనే రారు. దానికి కొండంత కష్టం చేసిన తర్వాతే వారు విజేతలుగా మారతారన్న విషయం రాజ్ కుమార్ రావు జీవితంలోని ఈ ఉదంతం మరోసారి స్పష్టం చేస్తోంది.