టాలీవుడ్ తెరపై ఒకప్పుడు ప్రేక్షకులకి అదనపు అందం అవసరమైనప్పుడు ముంబై భామలను రంగంలోకి దింపేవారు. ఆ ముద్దుగుమ్మలు అలా తెరపై మెరిసి మాయమయ్యేవారు. ఆ తరువాత కాలంలో కథానాయికల నటనకి గల ప్రాధాన్యత తగ్గుతూ .. వాళ్ల గ్లామర్ కి ప్రాముఖ్యత పెరగడం మొదలైంది. దాంతో గ్లామరస్ కథానాయికలకు రెడ్ కార్పెట్ పడిపోయింది. అప్పటి నుంచి ముంబై భామల జోరు పెరగడం మొదలైంది. మధ్యలో మలయాళ భామలు కూడా ఎంట్రీ ఇచ్చేసి తామేమీ తక్కువ తినలేదని నిరూపిస్తూనే ఉన్నారు.
ఈ నేపథ్యంలో తెలుగులో ఇప్పుడు ఎక్కడ చూసినా పాన్ ఇండియా అనే మాట వినిపిస్తోంది. స్టార్ డమ్ ఉన్న చాలా మంది హీరోలు తమ సినిమాలు తెలుగుతో పాటు ఇతర భాషల్లో విడుదల కావాలని కోరుకుంటున్నారు.
అక్కడ మార్కెట్ పరంగా హెల్ప్ కావడాలంటే అన్ని ప్రాంతాల్లో బాగా క్రేజ్ ఉన్న .. బాగా తెలిసిన హీరోయిన్స్ కావాలి. అలా ఉండే అవకాశం ఒక్క బాలీవుడ్ బ్యూటీలకి మాత్రమే ఉంది. అందువలన వాళ్లకి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టారు. అలా ఇటీవల కాలంలో బాలీవుడ్ నుంచి దిగుమతి అవుతున్న హీరోయిన్స్ సంఖ్య పెరుగుతోంది.
ఇటీవల కాలంలో 'సాహో' కోసం శ్రద్ధా కపూర్ .. 'భరత్ అనే నేను' కోసం కియారా అద్వాని .. 'లైగర్' కోసం అనన్య పాండే .. 'ఆర్ ఆర్ ఆర్' కోసం అలియా భట్ ను రంగంలోకి దింపారు. తాజాగా ఈ జాబితాలో మరో బాలీవుడ్ హీరోయిన్ పేరు వినిపిస్తోంది .. ఆ అందాల మందారం పేరే 'పరిణీతి చోప్రా'. బాలీవుడ్ కుర్రాళ్ల మనసులను భారీగానే దోచుకున్న ఈ బ్యూటీ, ప్రస్తుతానికి మాంఛి ఊపు మీదే తన జోరును కొనసాగిస్తోంది. ఇటీవల అక్కడ తన పారితోషికం కూడా పెంచేసింది. ఈ నేపథ్యంలో ఆమె తెలుగు తెరకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రామ్ హీరోగా బోయపాటి ఒక భారీ బడ్జెట్ సినిమా చేయడానికి రంగంలోకి దిగాడు. శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇటీవలే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటన వచ్చింది. ఈ సినిమా షూటింగు ఇంకా మొదలుపెట్టక ముందే ఇది పాన్ ఇండియా సినిమా అని చెప్పేశారు. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లోను ఈ సినిమాను విడుదల చేయనున్నామని అన్నారు.
అలాంటి ఈ సినిమాలో కథానాయికగా పరిణీతి చోప్రాను తీసుకోనున్నట్టు వార్తలు బలంగానే వినిపిస్తున్నాయి. చివరికి ఆమెనే ఖరారు అవుతుందేమో చూడాలి. ప్రస్తుతం లింగుసామి దర్శకత్వంలో 'ది వారియర్' చేస్తున్న రామ్ , అది పూర్తికాగానే ఈ సినిమా సెట్స్ పైకి వచ్చేస్తాడన్న మాట.