టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అనే తేడా లేకుండా ప్రతీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆస్కార్ అవార్డులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. తమ సినిమా ఆస్కార్ కు నామినేట్ కావాలని కోరుకోని దర్శక నిర్మాతలుండరు. ఇక జీవితంలో ఒక్క ఆస్కార్ అవార్డయినా అందుకోవాలని నటీనటులు ఉవ్విళ్లూరుతుంటారు. అయితే, ఒక్కోసారి భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలకు కూడా దక్కని ఆస్కార్ అవకాశం కొన్ని చిన్న సినిమాలకు దక్కుతుంది. అదే కోవలో బాలీవుడ్ మూవీ న్యూటన్ ఈ ఏడాది ఆస్కార్ అవార్డుకు భారత్ తరపున అధికారికంగా నామినేట్ అయింది. ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఈ సినిమా నామినేట్ అయిందని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధికారికంగా ప్రకటించింది. 26 భారతీయ చిత్రాలను పరిశీలించిన జ్యూరీ సభ్యులు చివరకు న్యూటన్ ను ఎంపిక చేశారు. చేసింది. తెలుగు నుంచి బాహుబలి 2తో పాటు గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాలను కూడా ఆస్కార్ నామినేషన్ ల కోసం పరిశీలించినట్టుగా జ్యూరీ చైర్మన్ సీవీ రెడ్డి తెలిపారు.
బాలీవుడ్ విలక్షణ నటుడు రాజ్ కుమార్ రావు న్యూటన్ సినిమాలో లీడ్ రోల్ పోషించారు. నిజాయితీ గల గవర్నమెంట్ క్లర్క్ పాత్రలో రాజ్ కుమార్ రావు నటించారు. ఛత్తీస్ గఢ్ లోని మావోయిస్ట్ ప్రాబల్యం ఉన్న ప్రాంతంలో ఎలక్షన్ డ్యూటీ కోసం వెళ్లిన రాజ్ కుమార్ రావుకు ఎదురైన ఇబ్బందుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. అన్ని అడ్డంకులను అధిగమించి ఎన్నికలను సజావుగా జరపాలని తాపత్రేయపడే ప్రభుత్వాధికారి పాత్రలో రాజ్ కుమార్ రావు నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా ఆస్కార్‌కు నామినేట్ అయినందుకు రాజ్‌కుమార్ రావు చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఈ సినిమాలో రాజ్ కుమార్ రావుతో పాటు పంకజ్ త్రిపాఠి - అంజలి పాటిల్ - రఘుబిర్ యాదవ్ ప్రధానపాత్రల్లో నటించారు. ఈ సినిమాకు అమిత్ మసూకర్ దర్శకత్వం వహించారు.