టాలీవుడ్ కు బాలీవుడ్ పోటీ

Update: 2018-03-08 04:25 GMT
అనుష్క.. తమన్నా.. శ్రుతిహాసన్.. రకుల్ ప్రీత్ సింగ్ వీళ్లంతా తెలుగులో టాప్ హీరోయిన్లు. నిన్న మొన్నటి వరకు వీళ్ల డెయిరీ అస్సలు ఖాళీ ఉండేది కాదు. వాళ్ల కాల్షీట్ల కోసం దర్శక నిర్మాతలు నానా పాట్లు పడాల్సి వచ్చేది. ఇప్పుడీ హీరోయిన్లు తెలుగులో చేస్తున్న సినిమాలేంటంటే ఒకటో అరో తప్ప పెద్దగా లేవు. వీళ్లే కాదు.. రెజీనా.. కాజల్ అగర్వాల్.. ప్రగ్యా జైస్వాల్ లాంటి పాపులరయిన హీరోయిన్ల డెయిరీలు కూడా ఖాళీగానే ఉన్నాయి.

భాగమతి సినిమాకు అనుష్క డేట్ల కోసం డైరెక్టర్ నాలుగేళ్లపాటు ఎదురుచూశానని చెప్పాడు. అలాంటిది భాగమతి తరవాత అనుష్క ఒక్క చిత్రంలో కూడా నటించట్లేదు. మిల్కీ బ్యూటీ తమన్నా కూడా క్వీన్ రీమేక్ - కళ్యాణ్ రామ్ తో ఓ సినిమా మాత్రం చేస్తోంది. క్వీన్ రీమేక్ కూడా డైరెక్టర్ నీలకంఠతో తేడా వచ్చి ఆగింది. కన్నడ వెర్షన్ డైరెక్టర్ రమేష్ అరవింద్ డైరెక్టర్ సీట్లోకి రావడంతో తిరిగి మొదలైంది. నిన్నటివరకు హీరోలందరికీ సింగిల్ ఛాయిస్ గా ఉన్న రకుల్ ఇప్పుడు ఒక్క సినిమా కూడా చేయడం లేదు.

ఇదే టైంలో బాలీవుడ్ నుంచి హీరోయిన్లు వరసగా తెలుగులోకి దిగుమతి అయిపోతున్నారు. సాహోతో శ్రద్ధ కపూర్.. సవ్యసాచితో నిధి అగర్వాల్.. భరత్ అనే నేనుతో కైరా అద్వానీ తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ఇక్కడ పాపులరైన హీరోయిన్లంతా బాలీవుడ్ లో ఛాన్సులు సంపాదించుకుందామని చూస్తుండేసరికి.. బాలీవుడ్ భామలంతా టాలీవుడ్ కు వచ్చేశారు. పాత బ్యూటీలకు కొత్త అవకాశాలు రావాలంటే కాస్త గట్టిగానే ప్రయత్నం చేయాలి. తప్పదు.


Tags:    

Similar News