అలియాపై బాలీవుడ్..హాలీవుడ్ స్పెష‌ల్ కేర్!

Update: 2022-07-01 07:34 GMT
బాలీవుడ్ న‌టి అలియాభ‌ట్ గర్భం దాల్చినా షూటింగ్ విష‌యంలో త‌గ్గేదేలే అంటూ దూసుకుపోతున్న సంగ‌తి  తెలిసిందే.  ప్ర‌స్తుతం ఆమె క‌థానాయిక‌గా న‌టిస్తోన్న సినిమాలు కొన్ని సెట్స్ లో ఉన్నాయి. వాటిని పూర్తిచేసే వ‌ర‌కూ అలియా విరామం లేకుండా  ప‌నిచేయ‌డానికి సిద్ద‌మ‌వుతోంది. ర‌ణ్ వీర్ సింగ్ స‌ర‌స‌న 'రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ క‌హానీ'లో న‌టిస్తోంది.

ఇప్ప‌టికే చాలా భాగం షూటింగ్ స‌హా పాట‌ల చిత్రీక‌ర‌ణ జ‌రిగింది. అయితే ఓ పాట బ్యాలెన్స్ ఉండిపోయింది. విదేశాల్లో షూట్ చేయాల్సిన పాట కావ‌డంతో యూనిట్ ఆ పాట‌ని చివ‌ర్లో షూట్ చేద్దామ‌ని వ‌దిలేసింది. ఇప్పుడా స‌మ‌యం ఆస‌న్న‌మైంది. జు లై తొలి వారంలో  ఆపాట‌ని అలియా-ర‌ణ‌వీర్ పై ఆస్ర్టియాలో షూట్ చేయ‌డానికి యూనిట్ రెడీ అవుతోంది.

అందుకోసం టీమ్ ఇప్ప‌టికే ఆస్ర్టియాలో అన్ని ర‌కాల ఏర్పాట్లు చేస్తున్నారు. షూట్ లో భాగంగా సెట్స్ కి అన్ని ర‌కాల సౌకర్యాల‌తో కూడిన అంబులెన్స్ లు సైతం రెడీగా పెడుతున్న‌ట్లు  తెలుస్తోంది. అలియా గ‌ర్బ‌వ‌తి కావ‌డంతోనే ఈ ర‌క‌మైన ఏర్పాట్లు చేసిన‌ట్లు తెలుస్తోంది. ఆ పాట షూటింగ్ పూర్తిగాకాగానే అలియా ఆస్ర్టియా నుంచి నేరుగా లండ‌న్ చేరుకుంటుంద‌ని స‌మాచారం.

హాలీవుడ్ సినిమా 'హార్ట్ ఆఫో స్టోన్ 'షూటింగ్ లో భాగంగానే అలియా షెడ్యూల్ అలా ప్లాన్ చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. 'ఆర్ట్ ఆఫ్ స్టోన్' షూటింగ్ కూడా ముగింపు ద‌శ‌లోనే ఉంది. అలాయాభ‌ట్ గ‌ర్బ‌వ‌తి కాక‌ముందే కీల‌క యాక్ష‌న్ స‌న్నివేశాలు పూర్తిచేసారు. త‌దుప‌రి లండ‌న్ షెడ్యూల్ లో ఇంకొన్ని యాక్ష‌న్ స‌న్నివేశాలు పూర్తిచేయాల్సి ఉంది.

అది పూర్త‌యితే అలియా పై షూట్ మొత్తం పూర్త‌వుతుంది. అందుకోస‌మే అలాయాభ‌ట్ నేరుగా లండ‌న్ చేరుకునేలా జ‌ర్నీ ప్లాన్ చేసుకుంది. ఆస్ర్టియా నుంచి ఇండియా వ‌చ్చి..ఇక్క‌డ నుంచి మ‌ళ్లీ లండ‌న్ జ‌ర్నీ ఇబ్బందులు త‌గ్గుతాయ‌నే కార‌ణంగా ఇలా ప్లాన్ చేసుకుంటున్న‌ట్లు  తెలుస్తోంది.

హాలీవుడ్ సినిమా యూనిట్ కూడా అలియా కోసం ప్ర‌త్యేకంగా ఆరోగ్య ప‌రంగా ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా సెట్ లో అన్ని ర‌కాల ఏర్పాట్లు..జాగ్ర‌త్తులు తీసుకునే చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం అలియాభ‌ట్ ముంబైలోనే ఉంది. వీలైనంత స‌మ‌యాన్ని కుటుంబంతోనే గడుపుతోంది. బ‌య‌ట తిర‌గ‌డం బాగా త‌గ్గింది. పెళ్లికి ముందు..పెళ్లి త‌ర్వాత చోటుచేసునే వ్య‌త్యాసం ఎలా ఉంటుంది? అన్న‌ది  అలియా ని చూస్తే తెలుస్తుంది.
Tags:    

Similar News