పుష్ప - ఆర్.ఆర్.ఆర్ - కేజీఎఫ్ 2 సంచలన విజయాలు సాధించడంతో ఇప్పుడు బాలీవుడ్ అగ్ర హీరోలకు చెమటలు పట్టేస్తున్నాయి. సౌత్ సినిమాలను మించి విజయాలు అందుకోవాల్సిన సన్నివేశం కనిపిస్తోంది. ముఖ్యంగా కిలాడీ అక్షయ్ కుమార్ కి ఇది పెను సవాల్ గా మారనుంది. దిగ్గజ నిర్మాత ఆదిత్య చోప్రా సారథ్యంలోని YRF కి కూడా ఇది పెద్ద సవాల్ అని అంతా భావిస్తున్నారు.
ఇప్పుడు అక్షయ్ - యష్ రాజ్ బ్యానర్ కాంబినేషన్ లో ఓ భారీ జానపద చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. పృథ్వీరాజ్ అనేది టైటిల్. ఈ మూవీ ఆర్.ఆర్.ఆర్ - కేజీఎఫ్ 2 తరహాలోనే 1000 కోట్ల క్లబ్ లో చేరుతుందా? అంటూ వాడి వేడిగా చర్చ మొదలైంది. బాలీవుడ్ ని దశాబ్ధాల పాటు ఏలిన కిలాడీ కుమార్ ఇప్పుడు సౌత్ హీరోలతో పోటీపడి నెగ్గుతాడా? అన్న విశ్లేషణ సాగుతోంది. కొన్నేళ్లుగా స్థిరమైన సక్సెస్ రేట్ తో ఉన్న అక్షయ్ ఇప్పటివరకూ 500 కోట్ల క్లబ్ లో లేడు. అతడు నటించిన సౌత్ సినిమా 2.0 మాత్రమే అతడికి ఆ క్రెడిట్ ని ఇచ్చింది.
అక్షయ్ కుమార్ తదుపరి పృథ్వీరాజ్ అనే శక్తివంతమైన సామ్రాట్ గా కనిపించబోతున్నారు. పృథ్వీరాజ్ చౌహాన్ జీవితం పరాక్రమం ఆధారంగా రూపొందించిన చిత్రమిది. అతను క్రూరమైన దండయాత్ర చేసిన మహమ్మద్ ఘోర్ కి వ్యతిరేకంగా నిలిచి ధైర్యంగా పోరాడిన యోధునిగా చరిత్ర లిఖించారు. యష్ రాజ్ ఫిల్మ్స్ - దర్శకుడు డా. చంద్రప్రకాష్ ద్వివేది ఈ చిత్రం మరో స్థాయిలో ఉండాలని కోరుకున్నారు. సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్ జీవితానికి అత్యంత ప్రామాణికమైన తెర రూపం ఇవ్వాలని కోరుకున్నారు.
ఆదిత్య చోప్రా YRF ఈ మూవీ కోసం తమ భవంతిలో మొత్తం అంతస్తును పృథ్వీరాజ్ కోసం పరిశోధన విభాగంగా మార్చినట్లు తెలుస్తోంది. దర్శకుడు చంద్రప్రకాష్ మాట్లాడుతూ, -“సినిమా రూపంలో మేము సామ్రాట్ పృథ్వీరాజ్ కి అతిపెద్ద అత్యంత అద్భుతమైన నివాళిని అర్పించాలనుకుంటున్నాం. మేము శక్తివంతమైన హిందూ యోధుని జీవితాన్ని ఆ కాలాన్ని అత్యంత ప్రామాణికమైన రీటెల్లింగ్ చేస్తున్నామని నిర్ధారించుకోవడానికి అవసరమైన ప్రతిదీ చేసాం. భారీ తనం నిండిన చారిత్రాత్మక కథను ప్రయత్నించడానికి మొదటి దశ ఎల్లప్పుడూ పరిశోధన ముఖ్యం. మేము పూర్తిగా క్షుణ్ణంగా హిస్టరీని తెలుసుకుని తెర రూపం ఖచ్చితమైనదిగా ఉండాలని కోరుకుంటున్నాము.. అని తెలిపారు.
నేను వ్యక్తిగతంగా 2004 నుండి 2019 వరకు స్క్రిప్ట్ ను ప్రతి సంవత్సరం అప్ డేట్ చేస్తూ పనిచేశాను! కాబట్టి సహజంగానే సినిమా చివరి డ్రాఫ్ట్ ను వ్రాయడానికి రిఫరెన్స్ పాయింట్ లుగా ఉపయోగించగల చాలా మెటీరియల్ ని నేను కలిగి ఉన్నాను. అది మాకు నటీనటులకు సినిమాని రూపొందించే సమయంలో మళ్లీ సందర్శించడానికి ఉపకరించింది. చిత్రీకరణ ప్రారంభించే ముందు YRFలోకి అనేక పుస్తకాలు.. సూచనలుగా ఉపయోగించే వివిధ రకాల దుస్తులు- కవచం-ఆయుధాలు మొదలైనవి ఉన్నాయి.
ఆదిత్య చోప్రా YRF కి చెందిన మొత్తం అంతస్తును పృథ్వీరాజ్ కోసం పరిశోధన విభాగంగా మార్చాడు. షూటింగ్ చివరి రోజు వరకు మేము రీసెర్చ్ విభాగాన్ని పూర్తిగా పని చేసేలా ఉంచాం. ఇప్పుడు ఈ పరిశోధన పనిని ప్రజలకు ప్రదర్శించడానికి ఒక ప్రణాళికను అన్వేషిస్తున్నాం. అద్భుతమైన రాజుకు సాధ్యమైనంత ఉత్తమంగా సెల్యూట్ చేయడానికి చేపట్టిన పని తాలూకా పరిమాణాన్ని ప్రజలు అర్థం చేసుకునేలా ఈ పరిశోధనను వారు ఎంత ఉత్తమంగా ప్రదర్శించగలరో చూడడానికి బృందాలు పని చేస్తున్నాయి... అన్నారు.
అక్షయ్ కుమార్ మాట్లాడుతూ.. “డాక్టర్ సాబ్ ఈ చిత్రానికి కథను నేరేట్ చేసినప్పుడు.. ఈ చిత్రానికి స్క్రిప్ట్ ను రాసేటప్పుడు అతను చేసిన రీసెర్చ్ చూసి నేను ఆశ్చర్యపోయాను. చారిత్రాత్మక కథను రాయడం దర్శకత్వం వహించడం అంత తేలికైన పని కాదు. సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్ జీవితానికి ఆయన శౌర్యానికి అత్యంత అద్భుతమైన నివాళులు అర్పిస్తున్నామని నిర్ధారించడానికి అతను ఎటువంటి అవకాశాన్ని వదిలిపెట్టలేదు. అతను తన జీవితంలో 18 సంవత్సరాలు వేచి ఉన్నాడు.. పృథ్వీరాజ్ ను సామ్రాట్ జీవితంలో అత్యంత అద్భుతమైన రీటెల్లింగ్ గా మార్చాడు! ప్రజలు ఈ చిత్రాన్ని ఇష్టపడతారని ఇది శక్తివంతమైన రాజు జీవితానికి అత్యంత ప్రామాణికమైన సినిమా అని నేను ఆశిస్తున్నాను... అని అన్నారు.
టెలివిజన్ ఇతిహాసం చాణక్య విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రం పింజర్‌కు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. పాపులర్ రైటర్ డా. చంద్రప్రకాష్ ద్వివేది పృథ్వీరాజ్ కి దర్శకత్వం వహించారు. మానుషి చిల్లర్ రాజు పృథ్వీరాజ్ కి అత్యంత ప్రియమైన రాకుమారి సంయోగిత పాత్రను పోషిస్తోంది. మానుషి లాంచ్ ఖచ్చితంగా 2022లో ఘనంగా జరగనుంది. ఈ చిత్రం హిందీ- తమిళం - తెలుగులో జూన్ 3న విడుదల కానుంది.
ఇప్పటివరకూ అందిన వివరాల ప్రకారం.. బాహుబలి స్ఫూర్తితో రూపొందించిన చిత్రమిది. చాల కాలంగా మూలన పడిన స్క్రిప్టు దుమ్ము దులిపారని కూడా అర్థమవుతోంది. అయితే భారీతనం నిండిన విజువల్స్ తో రక్తి కట్టిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. అయినా బాహుబలిని కానీ ఆర్.ఆర్.ఆర్ - కేజీఎఫ్ ని కానీ కొట్టలకపోతే కుమార్ కథ ముగిసినట్టే! అంటూ విశ్లేషిస్తున్నారు.