సినిమాలు, షూటింగ్ లు బంద్ అయిపోయాయి. ఎప్పుడు స్టార్ట్ అవుతాయో తెలియదు. ఈ క్రమంలోనే సినీ ప్రముఖులంతా తీవ్ర డిప్రెషన్ లో కూరుకుపోయారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ నిర్మాత తాను బై సెక్సువల్ అంటే.. ద్విలింగ సంపర్కుడిని అని ట్విట్టర్ లో సంచలన నిజాలు చెప్పుకొచ్చాడు.
బాలీవుడ్ నిర్మాత, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ అయిన వికాస్ గుప్తా బాంబు పేల్చాడు. తాను ద్విలింగ సంపర్కుడిని అని.. స్ర్తీ, పురుషులనే బేధం లేకుండా ఎవరితోనైనా ప్రేమలో పడగలనని.. నాలాంటి వారు చాలా మంది ఉన్నారని.. నేను బైసెక్సువల్ అని చెప్పడానికి గర్వంగా ఫీలవుతున్నానని వికాస్ గుప్తా సంచలన నిజాలు పంచుకున్నారు.
ఈ విషయం చెప్పడానికి ఎవరూ బెదిరించలేదని.. నన్ను నేను గుర్తించేందుకు సాయం చేసిన ప్రియాంకశర్మ, పార్ట్ సంథాన్ లకు ధన్యవాదాలు అంటూ ట్విట్టర్ లో వికాస్ పేర్కొన్నారు. వారు చేసిన అవమానాల వల్ల నేను మరింత శక్తివంతంగా తయారయ్యానని తెలిపారు. దీనిపై వారు ఎలా స్పందిస్తారో చూస్తా.. నాకు మద్దతుగా నిలిచిన స్నేహితులకు ధన్యవాదాలు అంటూ తెలిపారు.
ఇక దేవుడు తనను ఇలా ఎలా సృష్టించాడో అలాగే తయారయ్యానని.. నా ప్రవర్తన పట్ల నా కుటుంబ సభ్యులు అవమానంగా భావించారని నా తల్లి ద్వేషించిందని.. వారు తనను చూసి అవమానంగా ఫీలయ్యారని.. కానీ ఇప్పుడు వారిని గర్వంగా తలెత్తుకునేలా చేశానని వికాస్ గుప్తా తెలిపారు.
ఈ ట్వీట్ ఇప్పుడు బాలీవుడ్ లో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. వికాస్ ధైర్యాన్ని నెటిజన్లు మెచ్చుకుంటూ మద్దతు తెలుపుతున్నారు. ఇలాంటి వారు చాలా అరుదు అంటూ మద్దతిస్తున్నారు.