ఒకప్పుడు టాలీవుడ్ సినిమాలకు బాలీవుడ్ సినిమాలకు చాలా వ్యత్యాసం ఉండేది. హీరోల పారితోషికం మొదలుకుని సినిమాల బడ్జెట్ ల వరకు అన్నింట్లో కూడా బాలీవుడ్ సినిమాలు అందనంత ఎత్తులో ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం సీన్ రివర్స్ అయ్యింది అన్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది.
బండ్లు ఓడలు అయ్యాయి.. ఔను మన టాలీవుడ్ హీరోల యొక్క రెమ్యూనరేషన్స్ 100 కోట్ల మార్క్ చేరింది. మన హీరోల యొక్క మార్కెట్ పాన్ ఇండియా ను క్రాస్ చేసింది. బాలీవుడ్ హీరోల సినిమాలు ఉత్తర భారతం వరకే.. కానీ మన హీరోల సినిమాలు అంతకు మించి అన్నట్లుగా విస్తరించాయి. కనుక మన హీరోలతో సినిమాల కోసం బాలీవుడ్ నిర్మాతలు క్యూ కడుతున్నారు.
రాజమౌళి ఏ హీరోతో సినిమా చేసినా కూడా ఆ హీరోలు ఇప్పుడు బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోలుగా మారిపోతున్నారు. బాహుబలి సినిమా తర్వాత బాలీవుడ్ లో ప్రభాస్ స్థాయి ఏంటో అందరికి తెల్సిందే. ప్రభాస్ కి వంద కోట్లకు పైగా పారితోషికం ఇచ్చి ఆయనతో సినిమాలు చేయాలని బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలు ఆశగా ఎదురు చూస్తున్నాయి.
ఇప్పుడు రాజమౌళి హీరోలు రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ల వంతు వచ్చింది. వీరిద్దరిని తమ బ్యానర్ లో నటింపజేసేందుకు గాను బాలీవుడ్ కు చెందిన పదుల కొద్ది నిర్మాతలు కోట్ల రూపాయల అడ్వాన్స్ లు పట్టుకుని తెగ తిరిగేస్తున్నాయి. ప్రస్తుతానికి డేట్లు ఖాళీ లేవు బాబోయ్ అంటున్నా కూడా రాబోయే రెండు మూడేళ్లకు అయినా పర్వాలేదు అన్నట్లుగా బాలీవుడ్ నిర్మాతలు ఆర్‌ఆర్‌ఆర్ స్టార్స్ ను వదలడం లేదట.
రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లతో పాటు మహేష్ బాబు డేట్ల కోసం కూడా బాలీవుడ్ నిర్మాతలు ఆసక్తిగా వెంట పడుతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు తదుపరి సినిమా రాబోతుంది. కనుక అప్పుడు మహేష్ బాబు పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్ స్టార్ అయ్యే అవకాశం ఉంది. అందుకే ముందస్తుగానే మహేష్ బాబు కు అడ్వాన్స్ ఇచ్చి పెడితే బాగుంటుందని బాలీవుడ్ నిర్మాతలు భావిస్తున్నారట.
ఆయనకు కూడా కోట్ల రూపాయల అడ్వాన్స్ ఇచ్చేందుకు పలువురు బాలీవుడ్ నిర్మాతలు ఆయన చుట్టు చక్కర్లు కొడుతున్నారు. మొత్తానికి మన రాజమౌళి వల్ల మన తెలుగు హీరోలకు బాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ పెరిగింది. అందుకే చాలా మంది హిందీ సినిమాల నిర్మాతలు మన హీరోలతో సినిమాలు చేసేందుకు క్యూ కడుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.