సూపర్‌ స్టార్‌ సినిమాలో బాలీవుడ్‌ స్టార్ డైరెక్టర్‌

Update: 2023-07-04 13:39 GMT
తమిళ్ సూపర్ స్టార్ విజయ్ హీరోగా రూపొందుతున్న 'లియో' స్థాయి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను దసరా కానుకగా పాన్ ఇండియా రేంజ్ లో భారీ ఎత్తున విడుదల చేసేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్న విషయం తెల్సిందే.

ఈ సినిమాలో ఇప్పటికే ప్రముఖ దర్శకులు గౌతమ్ వాసుదేవ్ మీనన్‌.. మిస్కిన్‌ లు నటిస్తున్న విషయం తెల్సిందే. తాజాగా ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్‌ కూడా నటించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. సినిమాలోని అత్యంత కీలక పాత్రకు గాను ఆయన్ను దర్శకుడు లోకేష్ కనగరాజ్ సంప్రదించాడు.. ఆయన ఓకే చెప్పాడు అని తమిళ మీడియా వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్‌ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఆయన విలన్‌ అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఆ విషయమై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.

తమిళ నటుడు అర్జున్‌ కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ఇక సీనియర్ స్టార్‌ హీరోయిన్ త్రిష ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

కమల్‌ హాసన్ తో విక్రమ్‌ సినిమాను రూపొందించిన దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ పాన్‌ ఇండియా రేంజ్ లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. అందుకే ఆయన తదుపరి సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

ఇంత మంది స్టార్ కాస్ట్‌ ఉండటంతో తమిళ్‌ తో పాటు పాన్ ఇండియా రేంజ్ లో అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. వెయ్యి కోట్ల సినిమా అంటూ విజయ్ అభిమానులు మాట్లాడుకుంటున్నారు. మరి ఆ స్థాయి లో లియో వసూళ్లు ఉంటాయా అనేది చూడాలి అంటే విడుదల వరకు వెయిట్‌ చేయాల్సిందే.

Similar News