సినిమా స్పాన్ పెరిగిన తర్వాత మన సినిమాలు పాన్ ఇండియా రిలీజ్ అవుతున్నాయి. దాదాపు మన స్టార్ హీరోల సినిమాలన్నీ వరుసగా నేషనల్ వైడ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అందుకే పాత్రకి తగిన ప్రాధాన్యతను బట్టి అందుకు తగిన నటుడిని తీసుకుంటున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ లో బాలీవుడ్ స్టార్స్ సందడి కూడా ఎక్కువైంది. ఒకప్పుడు తెలుగు సినిమాల్లో ఛాన్స్ వచ్చినా ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునే హిందీ తారలు ఇప్పుడు కావాలని తెలుగు సినిమాల్లో నటిస్తున్నారు. 2022 లో సౌత్ సినిమాల్లో మెరిసిన బాలీవుడ్ స్టార్స్ గురించి ఒక లుక్కేస్తే..
ఆర్.ఆర్.ఆర్ సినిమాలో అజయ్ దేవగన్ రాం చరణ్ తండ్రి పాత్రలో నటించారు. బాలీవుడ్ లో ఎలాంటి పాత్రలో అయినా మెప్పించే అజయ్ దేవగన్ ట్రిపుల్ ఆర్ లో భాగం అవడం ఆ సినిమాకు ప్రత్యేకతని తీసుకొచ్చింది. సినిమాలో ఆయన పార్ట్ కి కూడా సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారని చెప్పొచ్చు. ఇక అదే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అలియా భట్. సీత పాత్రలో అలియా అభినయం తెలుగు ఆడియన్స్ ని మెప్పించింది. తనకు ఇచ్చిన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేసింది అలియా భట్.
తెలుగు తెరపై సందడి చేసిన మరో భామ అనన్యా పాండే. లైగర్ సినిమాలో ఆమె విజయ్ దేవరకొండతో జోడీ కట్టింది. సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అమ్మడు సినిమా ఫలితం ఎలా ఉన్నా అమ్మడి ఎంట్రీ మాత్రం అదిరిపోయింది. కార్తికేయ 2 సినిమాలో అనుపం ఖేర్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమాలో ఆయన ఎపిసోడ్ హైలెట్ అని చెప్పొచ్చు. అది కూడా అనుపం ఖేర్ చేయడం ఆ పాత్రకి నెక్స్ట్ లెవల్ క్రేజ్ ఏర్పడింది. అలా కార్తికేయ 2తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు అనుపం ఖేర్.
ఇక మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ ఖాన్ కూడా సర్ ప్రైజ్ ఎంట్రీ ఇచ్చారు. సల్మాన్ తెలుగు ఫ్యాన్స్ అందరికి ఈ సినిమా సూపర్ ట్రీట్ ఇచ్చింది. అటు బాలీవుడ్ లవర్స్ కి కూడా తెలుగు సినిమాలో సల్మాన్ ఖాన్ సూపర్ అనిపించింది. తెలుగులో కాకుండా సౌత్ సినిమాల్లో బాలీవుడ్ తారల గురించి చూస్తే.. కె.జి.ఎఫ్ 2 సినిమాలో విలన్ గా సంజయ్ దత్ అధీరా పాత్రలో అదరగొట్టారు. అదే సినిమాలో రమికా సేన్ గా పిఎం పాత్రలో రవీనా టాండన్ కూడా తన నటనతో మెప్పించారు.
పిఎస్ 1 సినిమాలో ఐశ్వర్య రాయ్ కూడా అలరించింది. సౌత్ ఆడియన్స్ కి ఎంతో దగ్గరైన ఐశ్వర్య ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ పిఎస్ 1 తో ఆమె సర్ ప్రైజ్ చేశారు. బాలీవుడ్ భామ హ్యూమా ఖురేషి కూడా అజిత్ వలిమై సినిమాలో నటించి మెప్పించారు. ఇక బాలీవుడ్ యాక్టర్ వివేక్ ఒబెరాయ్ కూడా ఈ ఏడాది కడువా అనే మలయాళ సినిమాతో పాటుగా రుస్తుం అనే కన్నడ సినిమాలో నటించారు.
మొత్తానికి బాలీవుడ్ స్టార్స్ సైతం సౌత్ సినిమాల బాట పడుతున్నారు. పాత్ర నచ్చితే నటుడు ఏ భాషలో అయినా నటించడానికి రెడీ గా ఉంటారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్స్ ని తమ సినిమాలో ఉండేలా చేసి సినిమాకు మరింత మైలేజ్ వచ్చేలా చేస్తున్నారు మేకర్స్.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.