బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ప్రస్తుతం తమిళంలో అజిత్ హీరోగా ఒక సినిమాను నిర్మిస్తున్నాడు. అంతకు ముందు పింక్ ను తమిళంలో అజిత్ హీరోగా బోనీ కపూర్ నిర్మించిన విషయం తెల్సిందే. ఇప్పుడు అదే పింక్ సినిమా తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా రీమేక్ అవుతోంది. అందుకు సంబంధించిన చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. పింక్ రీమేక్ రైట్స్ తన వద్ద ఉండటం వల్ల బోనీ కపూర్ కూడా వకీల్ సాబ్ నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. ఒక వైపు తన తమిళ సినిమా హైదరాబాద్ లో నిర్మాణం జరుగుతూ ఉండగా మరో వైపు వకీల్ సాబ్ సినిమా కూడా హైదరాబాద్ లోనే చిత్రీకరిస్తున్నారు. అందుకే బోనీ కపూర్ తాజాగా షూటింగ్ ను పర్యవేక్షించేందుకు గాను హైదరాబాద్ వచ్చి ఇద్దరు హీరోలకు పార్టీ ఇచ్చాడు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. .
తన ఇద్దరు హీరోలకు ఒక ప్రముఖ హోటల్ లో బోనీ కపూర్ పార్టీ ఇవ్వడంతో పాటు ప్రముఖ దర్శకులు ఇద్దరు కూడా పార్టీలో పాల్గొన్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బోనీ కపూర్ పీఆర్ టీం స్పందించింది. గత రెండు వారాలుగా బోనీ కపూర్ పూర్తిగా ముంబయికే పరిమితం అయ్యి ఉన్నాడు. ఆయన హీరోలకు పార్టీ ఇచ్చినట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదు. అస్సలు వార్తల్లో కనీసం ఒక్క శాతం కూడా నిజం లేదంటూ వారు క్లారిటీ ఇచ్చారు. మీడియాలో ఈ వార్తలు వచ్చినా కూడా పవన్ అభిమానులు పెద్దగా స్పందించలేదు. ఎందుకంటే పవన్ కు ఇలాంటి పార్టీలు అంటే పెద్దగా నచ్చవు. పైగా చిన్న పార్టీ అయినా ఫొటోలు లీక్ అయ్యేవి. అలాంటిది ఇద్దరు స్టార్ లు పార్టీలో పాల్గొంటే ఫొటోలు రాకుండా ఎలా ఉంటాయి అంటూ కొందరు లాజిక్ తీసి అనుమానం వ్యక్తం చేశారు. వారి అనుమానం నిజం అయ్యి పార్టీ ఇవ్వలేదు ఏమీ ఇవ్వలేదు అంటూ క్లారిటీ వచ్చేసింది.