సంక్రాంతికి రామ్ చరణ్ వర్సెస్ బాలకృష్ణ కదా అని ఆలోచిస్తున్నారా... నిజంగానే సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద ఎన్టీఆర్ మరియు చంద్రబాఋ ఢీ కొట్టబోతున్నారు. అయితే ఏమాత్రం బలం లేని చంద్రబాబు చంద్రోదయం, ఎన్నో అంచనాల నడుమ రూపొందుతున్న ‘ఎన్టీఆర్’ ముందు నిలవడం అనుమానమే అంటూ అప్పుడు సినీ వర్గాల వారు ఒక అంచనాకు వచ్చేస్తున్నారు. ఒకవైపు ఎన్టీఆర్ బయోపిక్ ‘ఎన్టీఆర్’ రెండు పార్ట్ లుగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతుండగా, మరో వైపు చంద్రబాబు నాయుడు బయోపిక్ ను ‘చంద్రోదయం’ అనే టైటిల్ తో తెరకెక్కించారు.
ఇటీవలే ఈ చిత్రంకు సంబంధించిన చంద్రబాబు లుక్ ను కూడా విడుదల చేశారు. తాజాగా ఏపీ సచ్చివాలయంలో ‘చంద్రోదయం’ చిత్ర యూనిట్ సభ్యులు సీఎం చంద్రబాబు నాయుడును కలిసి ఆశీర్వాదం తీసుకుని సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లుగా చెప్పుకొచ్చారు. సినిమా గురించిన విశేషాలు, కథ ఎలా ఉండబోతుందనే విషయాలను చంద్రబాబుకు వివరించినట్లుగా తెలుస్తోంది.
ఈ చిత్రంలో చంద్రబాబు నాయుడు పాత్రతో పాటు ఎన్టీఆర్ పాత్ర కూడా ఉంటుందట. సినిమా చివర్లో ఎన్టీఆర్ పాత్ర.. ఆకులు ఎన్ని కాల్చినా బొగ్గులు కావు బ్రదర్, జిత్తులమారి నక్కలు - తోడేల్లు ఎన్ని ఏకమైనా కూడా అడవికి రాజు, మృగరాజు నా అల్లుడే అంటూ చెప్పే డైలాగ్ ఉంటుందట. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అయిన క్రమం, ఆ తర్వాత చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను ఎక్కువగా చంద్రోదయంలో చూపించబోతున్నారట.
ఎంత చిన్న సినిమా అయినా, క్రేజ్ లేని సినిమా అయినా కూడా ‘ఎన్టీఆర్’ సినిమాకు చంద్రబాబు నాయుడు సినిమాను పోటీగా వదలడం అంటే ఫ్యాన్స్ ను ఇబ్బంది పెట్టే విషయమే. అందుకే చంద్రోదయం విడుదల తేదీ మార్చుకుంటే బాగుంటుంది.