అఖిల్ సినిమాపై బోయపాటి ఫుల్ క్లారిటీ

Update: 2018-12-01 17:17 GMT
మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్ బోయపాటి శ్రీను ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో 'వినయ విధేయ రామ' సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా సంక్రాంతి పండగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి బోయపాటి ఈ సినిమా తర్వాత చేయబోయే సినిమా ఏది? అయన ఏ హీరోతో ఈసారి కమిట్ అయ్యాడు అనేవిషయంలో చాలా స్పెక్యులేషన్లు ప్రచారంలో ఉన్నాయి.

అందులో ఒకటి.. అక్కినేని చినబాబు అఖిల్ ను డైరెక్ట్ చేయడం.  ఈమధ్య ఈ వార్తలపై స్పందించిన బోయపాటి తన నెక్స్ట్ ఫిలిం గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం తన ఫోకస్ అంతా చరణ్ సినిమాపైనేనని.. ఈ సినిమా పూర్తయిన తర్వాత నందమూరి బాలకృష్ణతో సినిమా ఉంటుందని తెలిపాడు. ఈ సినిమా ఆతర్వాత చేయబోయే సినిమా ఇంకా ఫైనలైజ్ కాలేదని.. ఇంకా ఈ సినిమాకు స్క్రిప్ట్ లాక్ చేయాల్సి ఉందని అన్నాడు.

దీంతో బోయపాటి తన నెక్స్ట్ సినిమాపై ఫుల్ క్లారిటీ ఇచ్చినట్టే.  'లెజెండ్'.. 'సింహా' ల తర్వాత ఈసారి బాలయ్య తో హ్యాట్రిక్ కాంబోకు రంగం సిద్ధమయిందన్నమాట. బోయపాటి-బాలయ్య హ్యాట్రిక్ కాంబో అంటే 'దబిడి దిబిడి 2.0'  అన్నమాట. 
Tags:    

Similar News