మోక్షజ్ఞ విషయంలో క్లారిటీ ఇచ్చిన బోయపాటి

Update: 2019-01-07 12:06 GMT
నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు, అదుగో, ఇదుగో అంటూ గత రెండు సంవత్సరాలుగా ఫ్యాన్స్‌ మరియు సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే బాలయ్య మాత్రం కొడుకు తెరంగ్రేటంను వాయిదా వేస్తూ వస్తున్నాడు. ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లో మోక్షజ్ఞ మూవీ ప్రారంభం అవుతుందని, వచ్చే ఏడాది అంటే 2020వ సంవత్సరంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు చెబుతున్నారు. మోక్షజ్ఞ కోసం ఎంతో మంది దర్శకులను పరిశీలిస్తున్నాడు బాలయ్య, ఆ క్రమంలోనే బోయపాటిపై ఎక్కువ ఫోకస్‌ పెడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

తాజాగా రామ్‌ చరణ్‌ తో వినయ విధేయ రామ చిత్రాన్ని తెరకెక్కించిన బోయపాటి శ్రీను ఆ సినిమా విడుదల సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను చెప్పడం జరిగింది. ఆ సమయంలోనే మోక్షజ్ఞ ఎంట్రీ మూవీ గురించి వస్తున్న వార్తలపై కూడా స్పందించాడు. మోక్షజ్ఞ మొదటి సినిమా నా దర్శకత్వంలో కరెక్ట్‌ కాదనేది నా అభిప్రాయం, ఎందుకంటే నా దర్శకత్వంలో సినిమా అయితే నందమూరి ఫ్యాన్స్‌ లో భారీ అంచనాలు పెరుగుతాయి. మొదటి సినిమాకు అంతగా అంచనాలుంటే కష్టం అవుతుంది. అందుకే మోక్షజ్ఞ మొదటి సినిమా నా దర్శకత్వంలో ఉండదని బోయపాటి క్లారిటీ ఇచ్చేశాడు.

బాలకృష్ణ కూడా పలు రకాలుగా ఆలోచించి ఆ తర్వాత మోక్షజ్ఞ మొదటి సినిమాను మాస్‌ స్టోరీతో కాకుండా క్లాస్‌ టచ్‌ ఉన్న ఎంటర్‌ టైన్‌ మెంట్‌ మూవీని చేయించాలని భావిస్తున్నాడట. ఈ ఏడాదిలోనే మోక్షజ్ఞ సినిమా ప్రారంభం అవుతుందంటూ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో బాలకృష్ణ చిన్న హింట్‌ ఇచ్చాడు. పూర్తి వివరాలు మాత్రం తెలియరాలేదు.


Full View

Tags:    

Similar News