గతేడాది సరైనోడు మూవీతో బోయపాటి శ్రీను గ్రాండ్ విక్టరీ సాధించాడు.. ఇండస్ట్రీ హిట్ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత ఎలాంటి క్రేజీ ఆఫర్స్ వచ్చినా లొంగని బోయపాటి.. ముందుగా అనుకున్న కమిట్మెంట్ ప్రకారం బెల్లంకొండ శ్రీనివాస్ తోనే సినిమా చేస్తున్నాడు. 'జయ జానకి నాయక' అనే టైటిల్ పై రూపొందుతున్న మూవీకి.. తాజాగా ఫస్ట్ లుక్ కూడా ఇచ్చేశాడు.
జయ జానకి నాయక మూవీ షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చేయగా.. ఆగస్ట్ లో విడుదల చేసేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే.. తన తర్వాతి సినిమాపై బోయపాటి ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చాడని అంటున్నారు. అక్కినేని అఖిల్ హీరోగా రూపొందే మూడో సినిమాకు దర్శకత్వం వహించనున్నాడట బోయపాటి. నిజానికి బెల్లంకొండతో సినిమా పూర్తి కాగానే.. మెగాస్టార్ సినిమా కోసం బోయపాటి వర్క్ చేయాల్సి ఉంది. మెగా152కు దర్శకుడు బోయపాటినే అనే సంగతి ఇప్పటికే అనధికారికంగా తెలిసిపోయింది. కానీ చిరంజీవి ఇంకా తన 151వ సినిమా ఉయ్యాలవాడను ప్రారంభించాల్సి ఉంది. ఆగస్ట్ లో ఆరంభిస్తే అక్కడి నుంచి కనీసం ఏడాది తర్వాత కానీ విడుదల అయ్యే అవకాశం లేదు.
అందుకే ఈ లోపు ఓ మూవీ పూర్తి చేసేయాలని ఫిక్స్ అయ్యాడట బోయపాటి శ్రీను. అలా ఫిక్స్ అవడానికి.. అక్కినేని నాగార్జున నుంచి వచ్చిన క్రేజీ ఆఫర్ కారణం అని తెలుస్తోంది. అఖిల్ సినిమాలను టాప్ డైరెక్టర్స్ తో చేయించేందుకు నిర్ణయించుకున్న నాగ్.. బోయపాటికి ఏకంగా 12 -15 కోట్ల మేర రెమ్యూనరేషన్ ఆఫర్ చేశాడని అంటున్నారు. ప్రాజెక్ట్ ఖాయం అయితే.. రెమ్యూనరేషన్ ఫిక్స్ కానుందని తెలుస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/