యాక్షన్ సినిమాలను, మాస్ మూవీస్ ను తనదైన శైలిలో తెరకెక్కించి ప్రేక్షకులను మెప్పిస్తున్న బోయపాటి శ్రీను తాజాగా సరైనోడు రూపంలో మరో విజయాన్ని తన ఖాతాలో జమ చేసుకున్నాడు. తొలి రోజు నుండీ ఈ చిత్రానికి మిక్సడ్ టాక్ వినిపిస్తున్నా బోయపాటి సినిమా అంటే గుర్తుకొచ్చే అంశాలన్నీ ఈ సినిమాలో పుష్కలంగా వుండడంతో మాస్ ఫుల్ హ్యాపీ..
బన్నీలో ఊర మాస్ యాంగిల్ ని చూపించినా డైరెక్టర్ ఈ సినిమా ద్వారా మనకు ఆది రూపంలో కొత్త విలన్ అందించడం మరో విశేషం. వైరం ధనుష్ పాత్రలో ఆది పినిశెట్టి అద్భుతంగా నటించాడు. పాత్రలో వెయిట్ ని అమాంతం ఈజీగా క్యారీ చేసి టాలీవుడ్ కి తన కొత్త రూపం చూపించాడు. ఇకపై ఆదికి ఇటువంటి అవకాశాలు వరుసపెట్టి వస్తాయనడంలో సందేహంలేదు.
లెజెండ్ ద్వారా జగపతిబాబు ని విలన్ గా పరిచయం చేసిన బోయపాటి ఇప్పుడు అదే ట్రెండ్ ని సెట్ చేసుకుంటూ పోతున్నాడు. విలన్లకొరతలో వున్న తెలుగు సినిమాకు ఈ ప్రయోగాలు మంచి ఊరట. ప్రస్తుతం జగపతి బాబు తెలుగులో మంచి రోల్స్ చేస్తున్నాడు. ఆది కూడా అదే రేంజ్ లో విజయం సాధించాలని కోరుకుందాం.