బ్రహ్మీ క్లారిటి ఇవ్వాల్సిన అసవరం ఉందా?

Update: 2017-04-15 09:47 GMT
ఇప్పుడు హాస్యబ్రహ్మ బ్రహ్మానందం కంప్లీట్ గా డౌన్ ఫాల్ పొజిషన్లో ఉన్నాడు. ఒక ప్రక్కన సినిమాలు రావట్లేదు. ఈయన చేసిన సినిమాలు ఆడట్లేదు. వేసిన క్యారెక్టర్లు పండట్లేదు. అందుకే ఇప్పుడు బ్రహ్మీ కేవలం హాలిడేయింగ్ అండ్ రిలాక్సియంగ్ మోడ్ లోకి వచ్చేశాడు. ఇక మొన్నామధ్యన మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్ లో సెల్రబిటీ గెస్టుగా వచ్చాడు. తనకు సినిమా కెరియర్ ఇచ్చిన చిరంజీవిని పొగిడేస్తూ.. ఆ తరువాత దర్శకుడు జంధ్యాల ప్రస్తావన తేవడంతో నానా చిక్కులే వచ్చాయి. జంద్యాల భార్య ఫోన్ చేసి తిట్టినట్లు ఆవిడే స్వయంగా మీడియాకు చెప్పింది.

ఇక ఇప్పుడు బ్రహ్మీ ఏమంటున్నాడంటే.. ''ఎవరో ఒకతను మీరు తాగారా అని జంధ్యాలను ప్రశ్నిస్తే.. ఆయన ఆ కామెంట్ ను కూడా తనకు అనుకూలంగా మార్చుకుని వాడేసుకుని కామెడీ చేశాడనే చెప్పాను. అంతేకాని.. జంధ్యాల తాగుతారనో తాగారనో నేను అనలేదు. అసలు ఏమన్నానో తెలుసుకోకుండా అటు ఆవిడ.. ఇటు మీడియా తెగ హడావుడి చేసి కల్పితాలను వండేస్తున్నారు'' అంటున్నాడు. నిజానికి ఈయన ఇచ్చిన క్లారిటీ పర్ఫెక్ట్ గా ఉండి ఉండొచ్చు కాని.. అసలు ఈ క్లారిటీ అవసరమా??

నిజానికి ఇప్పటి తరానికి జంధ్యాల అంటే ఎవరో సరిగ్గా తెలియనే తెలియదు. ఆయన సినిమాలపై కూడా గ్రిప్ పెద్దగా లేదు. ఏదో ఫిలిం ఇండస్ర్టీలో పనిచేసే అసిస్టెంట్ రైటర్లు డైరక్టర్లు జంధ్యాల సినిమాలను తెగ చూస్తుంటారు కాని.. మిగతా జనాలకు ఆయనపై అవగాహన కూడా తక్కువే.. ఇప్పుడు ఆయన గురించి బ్రహ్మి క్లారిటీ ఇచ్చినా ఒకటే ఇవ్వకపోయినా ఒకటే. అదంతా ఒకెత్తయితే.. అసలు చేతిలో సరైన సినిమాలు హిట్లు లేని సమయంలో బ్రహ్మానందం ఇలాంటి క్లారిటీలు ఇస్తే.. న్యూస్ లో ఉండటానికి తెగ ప్రయత్నిస్తున్నాడు అంటూ జనాలు అనుకునే ఛాన్సుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News