మీడియా ఏమో బ్రహ్మానందం పనైపోయింది.. ఆయనకు పెద్దగా అవకాశాల్లేవు అంటుంది. బ్రహ్మి ఏమో రెండు షిఫ్టుల్లో పని చేసేంత బిజీగా ఉన్నా అంటాడు. ఐతే బ్రహ్మి జనాల్ని తన స్థాయికి తగ్గట్లు నవ్వించి చాలా కాలమవుతోందన్నది మాత్రం వాస్తవం. చివరగా 'లౌక్యం' సినిమాలో పర్వాలేదనిపించాడు బ్రహ్మి. ఐతే బ్రహ్మి నుంచి ఇంకా ఎక్కువే ఆశిస్తారు జనాలు. బ్రహ్మిని సమర్థంగా వాడుకునే దర్శకుల్లో శ్రీనువైట్ల, త్రివిక్రమ్ శ్రీనివాస్‌లను ప్రధానంగా చెప్పుకోవాలి. వీళ్లిద్దరి సినిమాల్లో బ్రహ్మి క్యారెక్టర్ భలే హైలైట్ అవుతుంటుంది. ఐతే వైట్ల 'ఆగడు'లో బ్రహ్మి పెద్దగా నవ్వించలేకపోవడంతో బ్రహ్మి గురించి జరుగుతున్న ప్రచారం కొంత వరకు నిజమే అని జనాల్లో నమ్మకం పడిపోయింది.
ఇప్పుడిక అందరికళ్లూ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా 'సన్నాఫ్ సత్యమూర్తి' మీదే. అతడు దగ్గర్నుంచి అత్తారింటికి దారేది వరకు బ్రహ్మికి భలే క్యారెక్టర్లు ఇచ్చి ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించాడు త్రివిక్రమ్. మరి 'సన్నాఫ్ సత్యమూర్తి'లోనూ బ్రహ్మి అదే స్థాయిలో నవ్విస్తాడో లేదో చూడాలి. ఈ సినిమాలో లెక్కకు మిక్కిలి క్యారెక్టర్లున్నాయి. వాళ్లందరి మధ్య బ్రహ్మి తన ప్రత్యేకత చాటుకుంటే ఆయన గురించి జరుగుతున్న ప్రచారమంతా ట్రాష్ అని తేలిపోతుంది. కాబట్టి బ్రహ్మి కెరీర్‌కు ఈ సినిమా చాలా కీలకం.