అసలు ఈ మధ్యన బ్రహ్మానందం ఏ సినిమాలో ఉంటే ఆ సినిమా ఫ్లాపై పోతోంది అనేది ఒక వాదన. ఒకప్పుడు ఆయన సెకండాఫ్ లో ఉంటే సెకండ్ హీరోలా ఆదుకుంటాడు అన్నవారే.. ఇప్పుడు ఆయన్ను విమర్శిస్తున్నారు. దానికి తగ్గట్లే బ్రహ్మం కూడా ఈ మధ్యన హిట్లు కొట్టట్లేదు. చాలా రోజుల తరువాత సోగ్గాడే చిన్ని నాయనా సినిమా ఒకటే ఆయన ఖాతాలో హిట్టుగా పడింది. ఇంతకీ ఈ విషయంపై బ్రహ్మం మాష్టారు ఏమంటున్నారో తెలుసా..
''ఇప్పుడు.. ‘కృష్ణ’ - ‘అదుర్స్’లో నాకు సూపర్ పాత్రలిచ్చాడు వినాయక్. ఆ సినిమాలు పెద్ద హిట్టయ్యాయి. అందుకే ‘నావల్ల ఆ సినిమాలు ఆడాయి’ అని ఎక్కడైనా పొరపాటున అన్నానా? లేదే. అదే వినాయక్ ‘అఖిల్’ సినిమా తీశాడు. నాకూ ఓ మంచి రోలే ఇచ్చాడు. కానీ ఆ సినిమా ఫ్లాపైంది. అంతమాత్రాన నాకు నవ్వించడం చేత కాదనా లేకపోతే వినాయక్ సినిమా తీయలేడనా?'' అని అడుగుతున్నాడు బ్రహ్మానందం.
ఈ మొత్తాన్ని సమ్ అప్ చేస్తూ.. ''కొన్ని సినిమాలు ఆడతాయి. కొన్ని ఆడవు. సినిమా జీవితం అనే సముద్ర తరంగాల్లాంటిది. ఒక్కోసారి ఎగసి పైకె లేస్తుంది.. ఒక్కోసారి కింద పడుతుంది. రెండూ ఉంటాయి'' అని సెలవిచ్చారు కామెడీ కింగ్. అది సంగతి.