బాలకృష్ణ అందరితోను బావుంటారు

Update: 2018-01-09 14:44 GMT
ప్రతి ఏడాదిలో సంక్రాంతిని ఏ హీరో మిస్ అయినా నందమూరి బాలకృష్ణ మాత్రం అస్సలు మిస్ అవ్వరు. అది అందరికి తెలిసిన విషయమే. పక్క ప్లాన్ తో సంక్రాంతికి ఎంత టైమ్ ఉందొ తెలుసుకొని ముందే చాలా ఎనర్జీతో స్పీడ్ గా సినిమాను ఫినిష్ చేస్తారు. ఇకపోతే ఈ సంక్రాంతికి కూడా జై సింహా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న సంగతి తెలిసిందే. అయితే సినిమా యూనిట్ ప్రస్తుతం ప్రమోషన్స్ ని కూడా భారీ స్థాయిలో ప్లాన్ చేస్తోంది.

రీసెంట్ గా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించిన జై సింహా టీమ్ అందరిని ఆకట్టుకునే విధంగా మాట్లాడారు. అయితే చాలా రోజుల తరువాత బ్రహ్మానందం ఒక వేడుకలో కనిపించారు.జై సింహాలో ఆయన మంచి కామెడీ రోల్ తో కనిపించబోతోన్న సంగతి తెలిసిందే. అయితే ప్రీ రిలీజ్ వేడుకలో బాలయ్య గురించి ఆయనతో ఉన్న రిలేషన్ గురించి బ్రహ్మానందం వివరించారు. ఆయన మాట్లాడుతూ.. బాలయ్య మనస్తత్వం చాలా మంచిది. ఆయనతో ఎవరితో అయినా చాలా ఈక్వల్ గా ఉండడానికి ప్రయత్నిస్తుంటారు.

ముఖ్యంగా ఆయన తండ్రి గారి సినిమాలను చూస్తూ నటనలో గొప్పతనాన్ని ప్రతి ఒక్కరికి వివరిస్తారు. అంతే కాకుండా పద్యాలూ ఇతర సామజిక అంశాలు ఎలాంటివి అయినా బాలయ్య ఈజీగా అర్ధం చేసుకొని వివరిస్తారు. సినిమాలో కూడా ఆయన నటన అద్భుతమని బ్రహ్మానందం తెలిపారు. ఇక చిత్ర యూనిట్ లోని ప్రతి ఒక్కరు కూడా సినిమా కోసం చాలా కష్టపడ్డారు అని తప్పకుండా సినిమా మంచి విజయం సాదిస్తుందని బ్రహ్మానందం తెలియజేశారు. ఇక సినిమా జనవరి 12న రిలీజ్ కాబోతోన్న సంగతి తెలిసిందే.  


Tags:    

Similar News