ఖైదీలో అనుష్క ప్లేస్ లో బ్రహ్మానందం

Update: 2017-01-05 12:31 GMT
ఖైదీ నంబర్ 150 రిలీజ్ కి అంతా సిద్ధమవుతోంది. జనవరి 11న విడుదల కానున్న మెగా కంబ్యాక్ మూవీ కోసం మెగాభిమానులంతా చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఒక వైపు నిర్మాత రామ్ చరణ్ ప్రీరిలీజ్ ఫంక్షన్ పనులు చూస్తుంటే.. మరోవైపు మిగిలిన టెక్నికల్ టీం ప్రమోషన్ వర్క్స్ స్టార్ట్ చేసేశారు.

తాజాగా దర్శకుడు వివి వినాయక్.. ఖైదీ గురించిన ఆసక్తికరమైన సంగతులు చెప్పాడు. చిరు ఓసారి వినాయక్ కు ఫోన్ చేసి.. తనను దృష్టిలో పెట్టుకుని కత్తి చూడమని చెప్పారట. దీంతో ఆ సినిమా చూసి ఓ 10 రోజుల పాటు నోట్స్ రాసుకున్న వినాయక్.. మెగాస్టార్ ని కలిసి సినిమా రేంజ్ లో నేరేషన్ ఇచ్చారట. ఇందులో ఒరిజినల్ కు చేసిన చాలానే మార్పులు ఉంటాయని చెప్పాడు వినాయక్. అలాగే అనుష్క.. కాజల్ లను హీరోయిన్లుగా వినాయక్ చెప్పిన స్టోరీ ఉంటుందట. కానీ మొత్తం విన్న చిరంజీవి.. నాకు బ్రహ్మానందం కావాలి అని చెప్పి.. ఎలాగైనా సరే బ్రహ్మీ రోల్ ఉండేలా చూడమని చెప్పారట.

దీంతో అనుష్క కోసం అనుకున్న రోల్ ను తీసేసి.. బ్రహ్మీ కోసం పాత్రను సృష్టించాడట వినాయక్. అలా ఖైదీ నంబర్ 150లోకి బ్రహ్మానందం వస్తే.. అనుష్కకు ఛాన్స్ లేకపోయిందన్న మాట. తాను ముందే కాజల్ ను సూచించానని.. అందుకు తగ్గట్లుగానే ఆమెతోనే రోల్ చేయించామని.. వేరే ఏ హీరోయిన్ ను కనీసం సంప్రదించలేదని చెప్పాడు వినాయక్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News