'బ్ర‌హ్మ‌స్త్ర' రిలీజైతే బ్యాండ్ బాజాలే!

Update: 2020-02-08 11:30 GMT
బాలీవుడ్ న‌టుడు ర‌ణ‌బీర్ క‌పూర్- ఆలియాభ‌ట్ ప్రేమాయ‌ణం ముంబై వ‌ర్గాలు స‌హా అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లోనూ హాట్ టాపిక్. ఆర్.ఆర్.ఆర్ నాయిక‌గా ఆలియా ప్రేమాయ‌ణం పై మెగా - నంద‌మూరి ఫ్యాన్స్ లోనూ ఆస‌క్తి నెల‌కొంది. 2020 మోస్ట్ అవైటెడ్ మూవీగా చెబుతున్న ` బ్ర‌హ్మాస్త్ర‌`లో ఈ జంట‌ న‌టిస్తుండ‌టంతో సెట్స్ కు కలిసే వెళ్లేవారు. అలాగే తిరిగి ఇళ్ల‌కు వెళ్లినా క‌లిసే వెళుతుండ‌డం అది కాస్తా మీడియా కంటికి చిక్క‌డంతో బోలెడంత రాద్దాంతం అయ్యింది. ఆ ఇద్ద‌రి న‌డుమా ఒక‌రినొక‌రు విడిచి ఉండ‌లేనంత స్ట్రాంగ్ బాండింగ్ ఉంద‌న్న ప్ర‌చారం సాగింది. ఆ ఇరువురూ ఒక‌రినొక‌రు ఘాడంగా అర్ధం చేసుకోవ‌డానికి షూటింగులే వేదిక‌లా నిలిచాయి. క‌లిసి ఉంటేనే క‌ల‌దు సుఖం! అన్నంత‌గా ఆ ఇద్ద‌రూ క‌లిసి పోవ‌డం హాట్ టాపిక్ అయ్యింది. పెళ్లికి ముందే ఈ జంట షికార్ల‌ పై నిరంతం బాలీవుడ్ మీడియా క‌న్నేసి ఉంచింది.

ఇప్ప‌టికే ర‌ణ‌బీర్-ఆలియా కుటుంబాల మ‌ధ్య సాన్నిహిత్యం ప్ర‌ముఖం గా చ‌ర్చ‌కు వ‌చ్చింది. వార‌సుల పెళ్లికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేయ‌డం.. అటుపై క‌లిసి లంచ్ లు.. డిన్న‌ర్లు కానిచ్చేసారు. సైలెంట్ గా ఎంగేజ్ మెంట్ తంతు కూడా ముగించార‌న్న ప్ర‌చారం బాలీవుడ్ లో ఉంది. బ్ర‌హ్మ‌స్త్ర‌ రిలీజ్ అయిన త‌ర్వాత పెళ్లి బంధంతో ఆ ఇద్ద‌రూ ఒక‌టి కాబోతున్నార‌న్న ప్ర‌చారం సాగుతోంది. ఈ నేప‌థ్యంలో బాలీవుడ్ విమర్శకుడు, పాత్రికేయుడు రాజీవ్ మసంద్ ఒక ప్రత్యేక కాలమ్ లో ఓ టాప్ సీక్రెట్ ని రివీల్ చేసారు. డిసెంబ‌ర్ లో బ్ర‌హ్మ‌స్త్ర‌ రిలీజ్ అయిన వెంట‌నే ర‌ణ‌బీర్-ఆలియా పెళ్లి పీఠ‌లెక్క‌నున్నార‌ని ఆయ‌న తెలిపారు.

వివాహానికి సంబంధించి శుభ‌ ముహూర్తం నిర్ణ‌యించేందుకు ఇరు కుటుంబాలు సిద్ధ‌మ‌య్యార‌ని తెలిపారు. కుటుంబ స‌భ్యులు..స‌న్నిహితులు..స్నేహితుల‌ చెవిన అప్పుడే ఈ విష‌యాన్ని వేసేసారుట‌. అంటే డిసెంబ‌ర్ నాటికి ఎవ‌రు ఎక్క‌డున్నా బంధు మిత్రులు అంతా ముంబై లో వాలి పోవాల‌ని ముందుగానే సంకేతాలు పంపడం అన్నమాట‌. ఇరు కుటుంబాలు సినీ నేప‌థ్యం గ‌ల‌వే కాబ‌ట్టి పెళ్లి పిలుపుల శ్ర‌మ‌.. అన‌వ‌స‌ర ఖ‌ర్చు ఇప్ప‌టికి త‌గ్గిన‌ట్లే. అయితే పెళ్లిని మాత్రం అంగ‌రంగ వైభ‌వంగా చేయాల‌ని ఇరు కుటుంబాలు నిర్ణ‌యించుకున్నాయ‌ట‌.
Tags:    

Similar News