టాలీవుడ్ లో `బ్ర‌హ్మాస్ర్తం`..భ‌గ భ‌గ మండుతోంది!

Update: 2022-04-10 08:58 GMT
రాక్ స్టార్ ర‌ణ‌బీర్ క‌పూర్-అలియాభ‌ట్ జంట‌గా ఆయాన్ ముఖర్జీ ద‌ర్శ‌క‌త్వంలో `బ్ర‌హాస్ర్త` భారీ అంచ‌నాల మ‌ధ్య తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో బాలీవుడ్ లెజెండ‌రీ న‌టుడు అమితాబ‌చ్చ‌న్ తో పాటు.. టాలీవుడ్ కింగ్ నాగార్జున ఓ కీల‌క పాత్ర‌లో న‌టిన్నారు. ఇంకా మ‌రెంతో మంది స్టార్లు న‌టిస్తున్నారు. పాన్ ఇండియా కేట‌గిరీలో చిత్రం రిలీజ్ అవుతుంది. హిందీతో పాటు తెలుగు..త‌మిళ్..మ‌ల‌యాళం..క‌న్న‌డ భాష‌ల్లో రిలీజ్ అవుతుంది.

`బ్ర‌హ్మ‌స్త` మొద‌టి భాగం  తెలుగులో `బ్ర‌హ్మాస్ర్తం`..`శివం` మొద‌టి భాగంగా ప్రేక్షకుల ముందుకు వ‌స్తుంది. కాగా నేడు శ్రీరామ న‌వ‌మి సంద‌ర్భంగా `బ్ర‌హ్మ‌స్ర్తం`  తెలుగు పోస్ట‌ర్ ని లాంచ్ చేసారు. భ‌గ‌భ‌గ‌మండుతోన్న సూర్య గోళం న‌డుమ ర‌ణ‌బీర్ కపూర్-అలియాభ‌ట్  మ‌ధ్య రొమాన్స్ ఆస‌క్తిక‌రం. పోస్ట‌ర్ లో హీరో..హీరోయిన్ ఇద్ద‌రికి భారీ గాయాలైన‌ట్లు తెలుస్తోంది. మ‌రి `శివం`లో వీరిద్ద‌రి పోరాటం ప్రేమ కోస‌మా?  లేదా? అంత‌కు మించి ఇంకేమైనా?  ఉందా?  అన్న‌ది తెలియాలి.  భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కుతోన్న సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి.

తాజాగా కొత్త పోస్ట‌ర్ తో అంచ‌నాలు రెట్టింపు అవ్వ‌డం ఖాయం. తెలుగులో ఈ చిత్రానికి ద‌ర్శ‌క దిగ్గజం రాజ‌మౌళి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రించ‌డం విశేషం. దీంతో సినిమాకి తెలుగు నుంచి పెద్ద ఎత్తున ప్ర‌మోష‌న్ ల‌భిస్తుంది అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవ‌లే `ఆర్ ఆర్ ఆర్` తో మ‌రో 1000 కోట్ల సినిమాని ప్రేక్ష‌కుల‌కు అందించారు. ఈ సినిమా స‌క్సెస్ తో రాజ‌మౌళి ఇమేజ్ మ‌రింత రెట్టింపు అయింది.

ఇప్పుడా  క్రేజ్  `బ్ర‌హ్మ‌స్త్ర` కి ప‌నికొస్తుంది. జ‌క్క‌న్న ఎంట్రీతోనే సినిమాకి బోలెడంత ప్ర‌చారం వ‌స్తుంద‌ని చెప్పొచ్చు. అన్ని ప‌నులు పూర్తిచేసి థియేట‌ర్లో సెప్టెంబ‌ర్ 9న ఇదే ఏడాది భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఫాక్స్  స్టార్ స్టూడియోస్-ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్- ప్రైమ్ ఫోక‌స్.. స్టార్ లైట్ పిక్చ‌ర్స్ భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నాయి.

ఇందులో మూనీ రాయ్ మ‌రో కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. అలాగే  చిత్ర ద‌ర్శ‌కుడు ప్ర‌మోష‌న‌ల్ సాంగ్ గా  `కెసారియా` అనే గ్లింప్ సాంగ్ ని రిలీజ్ చేసి నెట్టింట  షేర్ చేసారు. మెలోడీ శ్రోత‌ల్ని ఆక‌ట్టుకుంటుంది. మ‌రి ఫుల్ బీట్ సాంగ్ ఎలా ఉంటుంది? అన్న‌ది చూడాలి.
Tags:    

Similar News