టీజ‌ర్ టాక్: ప్రొడ్యూస‌ర్ మారుతి ఈజ్ బ్యాక్

Update: 2018-07-09 13:57 GMT
ద‌ర్శ‌కుడిగా రెండు మూడు సినిమాల అనుభ‌వంతోనే నిర్మాత అయిపోయాడు దాస‌రి మారుతి. తాను తీయ‌లేని చిన్న క‌థ‌ల్ని త‌న అసిస్టెంట్ల‌తో.. ఔత్సాహిక యువ ద‌ర్శ‌కుల‌తో తీయించ‌డం మారుతికి అల‌వాటే. ఈ కోవ‌లో మారుతి నుంచి గ‌తంలో చాలా సినిమాలే వ‌చ్చాయి. కానీ వ‌రుస ఫ్లాపుల త‌ర్వాత ఈ త‌ర‌హా సినిమాల‌కు కొంచెం బ్రేక్ ఇచ్చేశాడు మారుతి. ఐతే కొంచెం గ్యాప్ త‌ర్వాత మారుతి ర‌చ‌న‌లో.. అత‌డి నిర్మాణంలో  ఓ సినిమా రెడీ అయింది. అదే.. ‘బ్రాండ్ బాబు ’ . నిన్న‌నే ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ లాంచ్ చేశారు. ఇప్పుడు టీజ‌ర్ కూడా వ‌చ్చేసింది. ఇది మారుతి మార్కు వినోదంతో ఆక‌ట్టుకునేలాగే ఉంది.

బ్రాండ్ పిచ్చి బాగా ఉన్న కుర్రాడు.. ఒక పేదింటి అమ్మాయితో ప్రేమ‌లో ప‌డితే ఎలా ఉంటుంద‌న్న‌దే ఈ క‌థ‌. బ్రాండ్ పిచ్చిన ఉన్న కుర్రాడిగా సుమంత్ శైలేంద్ర అనే కొత్త హీరో నటించ‌గా.. అతడికి జోడీగా తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా కనిపిస్తోంది. ప్రభాకర్ దర్శకత్వం వహించాడు. ‘బ్రాండ్ బాబు’కు క్యాప్షన్‌గా ‘అండ్ హిస్ ‘మెయిడ్’న్ లవ్ స్టోరీ’ అంటూ క్యాప్షన్ జోడించారు. పూర్తి భిన్న‌మైన హీరో హీరోయిన్ పాత్ర‌ల మ‌ధ్య కెమిస్ట్రీ.. కామెడీ బాగానే వ‌ర్క‌వుటైన‌ట్లున్నాయి టీజ‌ర్ చూస్తే. హీరో ఓ బ‌డా బాబు కొడుకు.. ఆ బ‌డా బాబుగా ముర‌ళీ వ‌ర్మ క‌నిపించాడు. ఆయ‌న క్యారెక్ట‌ర్ ఫ‌న్నీగా ఉంది. ఈషా రెబ్బా హోం మినిస్ట‌ర్ ఇంట్లో వంట చేసే పేదింటి అమ్మాయి పాత్ర‌లో క‌నిపించ‌నుంది. టీజ‌ర్ వ‌ర‌కైతే వినోదానికి ఢోకా లేన‌ట్లుగా ఉంది. మ‌రి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

వీడియో కోసం క్లిక్ చేయండి

Full View
Tags:    

Similar News