30% లాస్‌ కే తిరిగిస్తారా??

Update: 2015-10-29 08:12 GMT
బ్రూస్‌ లీ సినిమా నష్టాలను పూడ్చాలి అంటూ కొందరు పంపిణీదారులు రచ్చ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ విషయంపై నిర్మాత వైఖరి ఎలా ఉందంటారు? మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న వారి యవ్వారం ఎలా ఉంది? సన్నిహితులు చెబుతున్న వివరాలను బట్టి చూస్తుంటే.. అసలు పంపిణీదారులకు వచ్చింది ఏ లెక్కలో నష్టం అంటున్నారు వీరు.

రజనీకాంత్‌ తన బాబా - లింగా వంటి సినిమాలు విపరీతంగా నష్టపోయినప్పుడు.. ఈ పంపిణీదారులకు తిరుగు పంపిణీ కార్యక్రమం అని ఒకటి మొదలెట్టాడు. కాకపోతే ఆ సినిమాలను డిస్ర్టిబ్యూట్‌ చేసిన వారికి మాత్రం దాదాపు 70% లాస్‌ వచ్చింది. అప్పట్లో లింగా పంపిణీదారులు ధర్నాలూ గట్రా చేస్తూ ఏం చెప్పారంటే.. 30% లాస్‌ కోసం ఏ పంపిణీదారుడైనా ప్రిపేర్‌ అయ్యుంటాడు కాని.. అంతకంటే ఎక్కువ లాస్‌ అంటే మాత్రం కష్టం అంటూ చెప్పుకొచ్చారు. ఇక బ్రూస్‌ లీ విషయానికొస్తే.. 56 కోట్లకు అమ్మిన సినిమాకు 40 కోట్లు ఆల్రెడీ వచ్చేశాయి. అంటే 70% రికవర్‌ అయ్యింది. మరి మిగిలిన ముప్పయ్‌ శాతం ఇప్పుడు తిరిగి ఇవ్వమని అడుగుతున్నారా చరణ్‌ పంపిణీదారులు? ఆ లెక్కన చూస్తే ఇది కరెక్టు డిమాండ్‌ కాదనే అనిపిస్తోందట ఫిలిం ఛాంబర్‌ పెద్దలకు.

ఇకపోతే.. ఇలా ప్రతీ సినిమాకూ వచ్చిన లాస్‌ అంతా పూడ్చమని అంటే.. అది వ్యాపారం ఎలా అవుతుంది అని అడుగుతున్నారు బడా నిర్మాతలు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక పంపిణీదారుల అవసరమేముంది.. డైరెక్టుగా మా సినిమాలన్నీ మేమే రిలీజ్‌ చేసుకుంటాం అని కూడా చెబుతున్నారు వారు. చూద్దాం.. బ్రూస్‌ లీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.. రానున్న కాలంలో వచ్చే అని పెద్ద సినిమాలకూ అదే ఎప్లయ్‌ అయ్యే ఛాన్సుంది.
Tags:    

Similar News