పెళ్లికి ముందే మరో హీరోయిన్‌ ప్రెగ్నెంట్‌

Update: 2019-05-11 13:23 GMT
గ్లామర్‌ ప్రపంచంలో ప్రేమ, డేటింగ్‌ అనేది చాలా కామన్‌ గా చూస్తూ ఉంటాం. ఎంతో మంది స్టార్స్‌ పెళ్లి కాకుండానే సహజీవనం సాగించడం, పెళ్లికి ముందే తల్లితండ్రి అవ్వడం జరుగుతుంది. ఇండియన్‌ హీరోయిన్‌ అయిన ఎమీ జాక్సన్‌ పెళ్లికి ముందే ప్రెగ్నెంట్‌ అయిన విషయం తెల్సిందే. ప్రెగ్నెంట్‌ అయిన విషయంను ఆమె దాచకుండా విషయాన్ని వెళ్లడించి, ఇటీవలే తన ప్రియుడితో ఒక్కటయ్యింది. ప్రెగ్నెన్సీ అయిన తర్వాత పెళ్లి చేసుకునేందుకు సిద్దం అయిన హీరోయిన్స్‌ జాబితాలో బాలీవుడ్‌ మరో హీరోయిన్‌ చేరింది.

బాలీవుడ్‌ ప్రేక్షకులను తన అందాలతో అలరించిన బ్రూనా అబ్దుల్లా తాజాగా తాను ప్రెగ్నెంట్‌ అంటూ ప్రకటించింది. తన బేబీ బంప్‌ ఫొటోను కూడా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. పెళ్లికి ముందే ప్రెగ్నెంట్‌ అవ్వడం విదేశాల్లో సాదారణ విషయం. కాని ఇండియాలో మాత్రం విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. బ్రూనా ఇప్పుడు విమర్శలు ఎదుర్కొంటుంది. అయితే వాటికి ఘాటుగానే ఈ అమ్మడు సమాధానం చెబుతోంది. తన వ్యక్తిగత విషయం అని, పెళ్లి అనేది తాను ఒక పెద్ద విషయంగా భావించడం లేదు. పెళ్లి చేసుకున్న వారు విడిపోవడం లేదా అంటూ కామెంట్స్‌ చేసింది.

చాలా కాలంగా ఈమె బ్రిటన్‌ కు చెందిన అలెన్‌ ఫ్రేజర్‌ తో ప్రేమలో ఉంది. వీరిద్దరికి గత ఏడాది జులైలో వివాహ నిశ్చితార్థం అయ్యింది. తాజాగా బ్రూనా ప్రెగ్నెంట్‌ అవ్వడంతో పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. పెళ్లి కాకుండానే గర్బవతి అవ్వడం పట్ల తాను కాని తన కుటుంబ సభ్యులు కాని ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పుకొచ్చింది. తన తల్లి నాకు పుట్టబోతున్న బిడ్డ గురించి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. నా కుటుంబంలోని ప్రతి ఒక్కరు కూడా చాలా ఆసక్తిగా ఉన్నారు. ఇక అలెన్‌ వివాహ ఏర్పాట్లలో ఉన్నాడు. త్వరలోనే తాము పెళ్లి చేసుకోబోతున్నామని ఈమె చెప్పుకొచ్చింది.
Tags:    

Similar News