రచయితగా బీవీఎస్ రవికి మంచి క్రేజ్ ఉంది. విజయవంతమైన ఎన్నో సినిమాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. పాత్రలను మలిచే తీరులో .. సన్నివేశాలకు సహజత్వాన్ని ఆపాదించే విధానంలో ఆయనకంటూ ఒక పత్యేకత ఉంది. అలాంటి బీవీఎస్ రవి తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఎన్నో ఆసక్తికరమైన విషయాలను గురించి ప్రస్తావించారు. తను పనిచేసిన హీరోల గురించీ, తను చాలా దగ్గరగా చూసిన హీరోలను గురించి మాట్లాడారు.
"పవన్ కల్యాణ్ చాలా లోతైన మనిషి .. ఆయనలో దొంతరలు దొంతరులుగా ఆలోచనలు పుట్టుకొస్తూ ఉంటాయి. విపరీతమైన తపోశక్తి .. ధ్యానశక్తి ఉన్నవారు ఎలా కనిపిస్తారో నా కంటికి పవన్ అలా కనిపిస్తారు. ప్రభాస్ విషయానికొస్తే .. అందరూ ఆయనను డార్లింగ్ అంటారు .. నేను ఆయనను 'మహారాజు' అంటూ ఉంటాను. ప్రభాస్ ఛాతి ఎంత విశాలంగా ఉంటుందో .. ఆయన హృదయం అంత విశాలంగా ఉంటుంది. విశాలమైన హృదయం ఉన్నవాళ్లనే మహారాజు అంటారు. నా కుర్చీ ఎవరు ఎత్తుకుపోతారోననే భయం లేకుండా, ఎలా బ్రతకాలో అలా ధైర్యంగా బ్రతికేవాడు రాజు.
ఇక బన్నీ అంతటి హర్ వర్కర్ ను నేను చూడలేదు. ఒక గోల్ పెట్టుకుని ఆ దిశగా ఆయన తన ప్ర్రయాణాన్ని కొనసాగిస్తూ వెళుతున్నారు. ఒకసారి 'పరుగు' సినిమా సమయంలో అల్లు అర్జున్ ఒక మాట అన్నారు. "నేను అనుకున్న టార్గెట్ ను రీచ్ అయ్యేవరకూ నాకు అలసట ఉండదు" అని చెప్పారు. 'ఆ టార్గెట్ ఏమిటి?' అని నేను అడిగితే, "నెంబర్ వన్ స్టార్ కావడం" అన్నారు. అలాగే అవుతున్నాడు కదా! అందుకోసం ఆయన పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు అంటూ చెప్పుకొచ్చారు.