'బిగ్ బాస్' ఫేమ్ దివి వైద్య - గిరిధర్ - ధన్ రాజ్ - ప్రవీణ్ - శ్రీహాన్ - సిరి ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ''క్యాబ్ స్టోరీస్''. ఈ చిత్రానికి కేవీఎన్ రాజేష్ దర్శకత్వం వహించారు. ఇమేజ్ స్పార్క్ ప్రొడక్షన్ పతాకంపై ఎస్. కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. 'స్పార్క్' ఓటీటీలో ఈ నెల 28న క్యాబ్ స్టోరీస్ తొలి భాగం స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ - 'లవ్ రింగ్ టోన్' లిరికల్ వీడియోకు మంచి స్పందన లభిస్తోంది. ఈ క్రమంలో తాజాగా 'క్యాబ్ స్టోరీస్' ట్రైలర్ ను మిల్కీ బ్యూటీ తమన్నా విడుదల చేసి, చిత్ర బృందానికి విషెస్ అందించారు.
'మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ.. ఒక్కడే అబ్బాయి ఒక్కతే భార్య' అని గిరిధర్ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమైంది. ప్రేమ - అత్యాశ - విధి అంశాలను ప్రస్తావిస్తూ.. క్యాబ్ ప్రయాణం నేపథ్యంలో జరిగే సన్నివేశాలను ట్రైలర్ లో చూపించారు. ఈ జర్నీ దేని కోసం.. క్యాబ్ లో ఓ బ్యాగ్ మారిపోవడం వల్ల కొందరి జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి.. దీంట్లో ఉన్న మలుపులేంటనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 'తెలియక తప్పు చేస్తే తప్పా.. తెలుసుకుని సారీ చెప్తే తప్పా.. ఈ రెండూ నేను చేశానంటే నేను కరెక్టే కదా' అంటూ దివి చెప్పే డైలాగ్ ఆమె పాత్ర స్వభావాన్ని తెలియజేస్తోంది.
'ఓవర్ ఎగ్జైట్మెంట్ ఓవర్ థింకింగ్.. ఈ రెండూ రిలేషన్ కే కాదు.. ఆరోగ్యానికి కూడా హానికరం' అంటూ ట్రైలర్ లో వచ్చే డైలాగ్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి. లవ్ - దీనికి సుజాత సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ మరియు సాయి కార్తీక్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదనపు ఆకర్షణగా నిలిచాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా రిచ్ గా ఉన్నాయి. ఈ చిత్రానికి తమ్మిరాజు ఎడిటింగ్ వర్క్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే ప్రధాన పాత్రధారులందరూ తమ పాత్రల్లో మంచి నటన కనబరిచినట్లు తెలుస్తోంది.
అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ గా రూపొందిన 'క్యాబ్ స్టోరీస్' చిత్ర కథ, కథనాలు ప్రేక్షకులకు కొత్తగా ఉంటాయని.. ఇందులో ఊహించని మలుపులు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయని చిత్ర యూనిట్ చెబుతోంది. ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ కి సరైన కంటెంట్ అనే భావన కలిగిస్తోన్న ఈ చిత్రం 'స్పార్క్' ఓటీటీలో ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
Full View