రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ `లైగర్`. వెర్సటైల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. బాలీవుడ్ క్రేజీ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ తో కలిసి పూరి జగన్నాథ్, చార్మి భారీ స్థాయిలో నిర్మించిన పాన్ ఇండియా మూవీ ఇది. ఈ మూవీతో విజయ్ దేవరకొండ బాలీవుడ్ కు తొలి సారి పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. అనన్య పాండే హీరోయిన్ గా నటిచగా, వరల్డ్ ఫేమస్ బాక్సర్ మైక్ టైసన్ కీలక అతిథి పాత్రలో నటించారు.
రమ్యకృష్ణ తల్లి పాత్రలో నటించిన ఈ మూవీని తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో భారీ స్థాయిలో ఆగస్టు 25న విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. భారీ స్థాయిలో దేశ వ్యాప్తంగా విజయ్ దేవరకొండ ఈ మూవీని ప్రమోట్ చేస్తూ మరింత హైప్ ని క్రియేట్ చేస్తున్నాడు.
ఫ్యాన్ డమ్ టూర్ పేరుతో దేశ వ్యాప్తంగా చేస్తున్న టూర్ ఆగస్టు 23తో ముగియబోతోంది. వారణాసిలో జరిగే చివరి ఫ్యాన్ డమ్ మీట్ తో ప్రచారానికి తెర వేయబోతున్నారు. ఇదిలా వుంటే ఈ మూవీ రిలీజ్ మరో పది రోజులు కూడా లేదు. అయితే ఇంత వరకు ఈ మూవీకి సంబంధించి ఉభయ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఎవరికీ ఇవ్వలేదు.
మొత్తం హక్కుల్ని వరంగల్ శ్రీను సొంతం చేసుకుని గత కొన్ని రోజులుగా హోల్డ్ లో పెట్టాడు. రిలీజ్ కరెక్ట్ వారం మాత్రమే వుండటంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో `లైగర్` మూవీని ఎవరు రిలీజ్ చేస్తున్నారన్నది ఆసక్తికరంగా మారింది. తాజాగా వరంగల్ శ్రీను నైజాం హక్కుల్ని మాత్రం తన దగ్గరే పెట్టుకుని నైజాం హక్కుల్ని దిల్ రాజుకు ఇచ్చేశాడు. ఇక సీడెడ్ హక్కుల్ని వారాహి స్టూడియోస్ అధినేత సాయి కొర్రపాటికి, తిరుపతి ప్రసాద్ కు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు తదితర ఏరియాల హక్కుల్ని చదలవాడ శ్రీనివాసరావు కు ఇచ్చేశారు.
ఫైనల్ గా భారీ రేట్లకే ఈ మూవీ థియేట్రికల్ హక్కుల్ని అమ్మాలని భీష్మించుకున్న వరంగల్ శ్రీను అన్నట్టుగానే ఏపీ థియేట్రికల్ హక్కుల్ని ఫ్యాన్సీ రేట్లకు అమ్మేసినట్టుగా తెలుస్తోంది. ఇది విజయ్ దేవరకొండ సినిమాల్లోనే రికార్డు స్థాయిలో జరిగిన థియేట్రికల్ బిజినెస్ గా చెబుతున్నారు.