ఆ నటి పుస్తకంలో రాసుకున్న చివరి వింత కోరిక...

Update: 2016-12-29 01:30 GMT
సాదారణంగా ఎవరికైనా తమ చివరి కోరిక గురించి రకరకాల ఆశలు, ఆలోచనలు ఉండటం సహజం. ఈ విషయంలో చాలా మందికి ఆ అవకాశం ఉంటుంది, మరికొందరికి ఉండక్పోవచ్చు కూడా. అయితే ఈ విషయంలో సెలబ్రెటీలు లెజెండులు అనబడేవారు చాలా మంది వారి వారి వ్యక్తిగత పుస్తకాల్లో ఈ విషయాన్ని ప్రస్థావిస్తుంటారు. అలా తన పుస్తకంలో చివరి కోరిక గురించి వింతగా రాసుకుంది ప్రఖ్యాత హాలీవుడ్ నటి క్యారీ ఫిషర్.

స్టార్‌ వార్స్ సినిమాలో ప్రిన్సెస్ లీయా ఆర్గానాగా నటించిన ప్రఖ్యాత హాలీవుడ్ నటి క్యారీ ఫిషర్ (60) గుండెపోటుతో మంగళవారం మరణించింది. ఈ సందర్భంగా ఆమెకు హారిసన్ ఫోర్డ్‌ తోపాటు ఇతర స్టార్ వార్స్‌ సిరీస్‌ నటులు నివాళులర్పిస్తుండగా ఆమె చివరి వింత కోరిక ఒకటి వెలుగుచూసింది. ఇంతకూ ఆ చివరి వింత కోరిక ఏమిటంటే... "వెన్నెల వెలుగులో మునిగి, తన సొంత బ్రా వల్ల ఊపిరి ఆడక చనిపోయింది" అని అంట. అవును ఈ లైన్ నే తన మరణం గురించి శ్రద్ధాంజలిలో రాయాలని కోరుకుందట. ఇదేమి వింత కోరిక, ఇది నిజంగా నిజమేనా అని అనుమానించొద్దు. ఎందుకంటే... ఈ విషయాన్ని 2008లో తాను ప్రచురించిన ఆత్మకథ "విష్‌ ఫుల్ థింకింగ్"లో ఆమె పేర్కొంది.

ఇంతకూ ఈ వింత కోరికకు కారణం ఏమిటంటే... 1997నాటి స్టార్‌ వార్‌ సినిమాలో పిన్సెస్‌ లీయా పాత్ర అంతరిక్షంలో తెల్లని దుస్తులు ధరిస్తుంది. ఈ దుస్తుల గురించి దర్శకుడు వివరిస్తూ... వీటిని ధరించేటప్పుడు లోదుస్తులు వేసుకోవద్దని చెప్పాడట. ఈ విషయాలపై తన పుస్తకంలో ప్రస్థావిస్తూ... "ఆ  డ్రెస్‌ వేసుకొనేటప్పుడు బ్రా ధరించవద్దు, ఎందుకంటే అంతరిక్షంలోకి వెళ్లినప్పుడు మీ శరీర బరువు తేలికైపోతుంది.. అప్పుడు మీ శరీరం ఉబ్బిపోయే అవకాశం ఉండొచ్చు. అలా అని బ్రా పెరిగిపోదు" అని చెప్పాడట దర్శకుడు. దీంతో... "అందుకే నేను ఎలా చనిపోయినా పర్వాలేదు కానీ.. బ్రా వల్ల ఊపిరి ఆడక చనిపోయిందని మాత్రం తన శ్రద్ధాంజలిలో రాయమని నా స్నేహితులకు చెప్పాను" అంటూ తన పుస్తకంలో వివరించింది క్యారీ ఫిషర్‌.. సరదాగానే అయ్యి ఉండొచ్చనుకోండి!!


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News