సీనియర్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ను నాలుగేళ్ల నుంచి వెంటాడుతున్న ఓ కేసును కోర్టు కొట్టేసింది. మాజీ ఎమ్మెల్యే, ఒకప్పటి నిర్మాత చెంగల వెంకట్రావు 2011లో విజయేంద్ర ప్రసాద్ పై చెక్ బౌన్స్ కేసు వేశాడు. విజయేంద్ర ప్రసాద్ తనకిచ్చిన రూ.30 లక్షల చెక్కు బౌన్స్ అయిందంటూ ఆయన మీద వెంకట్రావు కేసు పెట్టాడు. ఈ కేసు విషయంలో రాజమౌళి తండ్రికి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంటు కూడా ఇచ్చింది. ఐతే ఈ కేసును విచారించిన అనంతరం ఎట్టకేలకు విజయేంద్ర ప్రసాద్ తప్పేమీ లేదంటూ కేసును కొట్టేసింది కోర్టు.
విజయేంద్ర ప్రసాద్.. వెంకట్రావు నిర్మించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘సమరసింహా రెడ్డి’కి కథ అందించారు. ఐతే తన బేనర్ లో ఇంకో సినిమా కోసం విజయేంద్రకు రూ.30 లక్షల అడ్వాన్స్ ఇచ్చారట వెంకట్రావు. ఐతే అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్న విజయేంద్ర ప్రసాద్.. తాను తీసుకున్న అడ్వాన్సును తిరిగిచ్చేస్తూ ఇచ్చిన చెక్కు బౌన్స్ అయిందంటూ వెంకట్రావు కోర్టుకెక్కారు. ఐతే ఆయన ఆరోపణలు కోర్టులో నిలబడలేదు. ఈ కేసుకు సంబంధించి నిర్మాతల మండలి విజయేంద్ర ప్రసాద్ ను హెచ్చరించడమే కాక.. ఆయనపై కొన్ని రోజుల పాటు నిషేధం కూడా విధించడం గమనార్హం.