తిరుపతి సమీపంలో మంచు మోహన్ బాబు కుటుంబం శ్రీ విద్యానికేతన్ పేరుతో భారీ స్థాయిలో విద్యా సంస్థల్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాఠశాలలో గతంలో ఇంగ్లిష్ టీజర్ పని చేసిన బ్యూలా అనే మహిళ.. మోహన్ బాబు.. మంచు విష్ణు సహా ఐదుగురిపై కేసు పెట్టింది. స్కూల్ యాజమాన్యం తరఫున వీళ్లు కూడా బ్యూలాపై కేసులు పెట్టారు. ఇంతకీ అసలేం జరిగిందంటే...
హైదరాబాద్ కు చెందిన బ్యూలా కొన్నేళ్లుగా విద్యా నికేతన్ సంస్థల్లో 12వ తరగతికి ఇంగ్లిష్ టీచర్ గా పని చేసేవారు. నవంబరు 28న ఆమె ఒక కార్యక్రమానికి డ్రెస్ కోడ్ లో రావాల్సిన బ్యూలా.. సివిల్ డ్రెస్సులో వచ్చింది. దీంతో ఆమెను యాజమాన్యం మందలించింది. దీన్ని అవమానంగా భావించిన బ్యూలా పోలీసులకు ఫిర్యాదు చేసింది. నవంబరు 28 నుంచి ఆమె విధులకు హాజరు కావడం లేదు. మూడు నెలల తర్వాత ఇప్పుడు భర్తతో కలిసి చంద్రగిరికి వెళ్లి మోహన్ బాబు.. విష్ణులతో పాటు ప్రిన్సిపల్.. హెచ్ ఆర్ మేనేజర్.. సీఈవోలపై ఫిర్యాదు చేసింది. వారిపై మూడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు.
ఐతే స్కూల్ యాజమాన్యం కూడా ఊరుకోలేదు. బ్యూలాపై చంద్రగిరి పోలీస్ స్టేషన్లోనే ఫిర్యాదు చేశారు. డ్రెస్ కోడ్ ఉల్లంఘించినందుకు మందలించిన మాట వాస్తవమని... ఐతే అప్పట్నుంచి విధులకు రాకపోవడంతో ఆమెను తప్పించామని.. సర్టిఫికెట్లు.. రావాల్సిన జీతం డబ్బులు తీసుకోవాలని సమాచారం పంపినా రాలేదని... రూ.5 లక్షలు ఇవ్వకుంటే కోర్టుకీడుస్తానని బెదిరించిందని చెబుతూ ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆమెపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.