సంచలన దర్శకుడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు సినిమాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచే వారు. కానీ ఇప్పుడు మాత్రం కాంట్రవర్సీతో నిత్యం వార్తల్లో హాట్ టాపిక్ గా మారుతున్నారు. ఇక సోషల్ మీడియాలో ఆయనకు సంబంధించిన వార్తలు ఏ స్థాయిలో వైరల్ అవుతుంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఎలాంటి కాంట్రవర్సీ క్రియేట్ అయినప్పటికీ కూడా దాన్ని రాంగోపాల్ వర్మ పబ్లిసిటీ గా గట్టిగా వాడుకుంటారు అని కూడా స్పెషల్ గా చెప్పనవసరం లేదు.
అయితే ఆయన ఈ మధ్య కొన్ని ఆర్థిక పరమైన ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు. ఆ మధ్య నిర్మాత నట్టికుమార్ కూడా రామ్ గోపాల్ వర్మ డబ్బులు తీసుకొని ఇవ్వడంలేదని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దాదాపు పది కోట్ల రూపాయల వరకు బాకీ పడ్డాడు అనే ఆరోపణలు చేశారు అంతేకాకుండా కోర్టు వరకు కూడా వెళ్లాల్సి వచ్చింది.
అయితే రీసెంట్గా రాంగోపాల్ వర్మ కు సంబంధించిన మరొక కొత్త కేసు కూడా వైరల్గా మారింది. మనీ లెండింగ్ ఇష్యూలో వర్మపై ఇప్పుడు మరో కేసు నమోదైంది. ఆర్జీవీ 56 లక్షలు అప్పు తీసుకున్నారని, తిరిగి చెల్లించడం లేదని శేఖర్ రాజు అనే వ్యక్తి కూకట్‌పల్లి కోర్టును ఆశ్రయించారు. తన డబ్బును తిరిగి ఇవ్వాలని అడిగితే ఆర్జీవీ తనను హెచ్చరించాడని, తిరిగి చెల్లించలేదని కూడా శేఖర్ రాజు పిటిషన్ లో వెల్లడించాడు. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఐపీసీ 406, 407, 506 కింద కేసు నమోదు చేయాలని పోలీసులను కోరింది. మరి ఇన్ని క్రిమినల్ కేసుల్లో ఇరుక్కున్న ఆర్జీవీ ఇప్పుడు ఏం చేస్తాడో చూడాలి.
ఇక రామ్ గోపాల్ వర్మ సినిమా విషయాలకు వస్తే ఆయన షూటింగ్ మొదలు పెట్టి ఆగిపోయిన సినిమాలు దాదాపు 50 వరకు ఉన్నాయి. ఇక ఆ సినిమాలలో చాలా వరకు కూడా ఆర్థిక కారణాల వల్లనే ఆగిపోయాయి. మరికొన్ని అప్పుల ఇచ్చిన వారు కేసులు పెట్టడం వలన ఆగి పోయాయి. దీంతో వర్మ కాలం గడిచిన తర్వాత అందరూ మర్చిపోయిన తర్వాత ఆ సినిమాలను బయటకు తీసి ఓటీటీలో విడుదల చేస్తున్నారు అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి.