మ‌హ‌ర్షి టికెట్లను ఎక్కువ‌గా అమ్మిన థియేట‌ర్ పై కేసు!

Update: 2019-05-17 06:30 GMT
కాసుల క‌క్కుర్తితో హైకోర్టు ఇచ్చిన తీర్పును అనుస‌రించిన సాగుతున్న దందా ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. కోట్లాది రూపాయిల రెమ్యున‌రేష‌న్లు.. ఇత‌ర‌త్రా ఖ‌ర్చుల‌తో భారీగా బ‌డ్జెట్ల‌ను పెంచేస్తూ.. సినిమా నిర్మాణం భారీగా మారింద‌న్న మాట‌ల్ని వింటూనే ఉన్నాం. ఇటీవ‌ల విడుద‌లైన మ‌హేశ్ బాబు మ‌హ‌ర్షి సినిమా టికెట్ల ధ‌ర‌ల్ని వారం పాటు పెంచేందుకు వీలుగా హైకోర్టు నుంచి అనుమ‌తి తీసుకోవ‌టం తెలిసిందే.

సినిమాల్లో నీతిని అదే ప‌నిగా పండించే సినిమాలు సైతం.. ప్రేక్ష‌కుల‌కు ఉండే ఉత్సుక‌త‌ను సొమ్ము చేసుకోవ‌టానికి ఎత్తులు వేసిన తీరుపై పలువురు త‌ప్పు ప‌డుతున్నారు. మ‌హ‌ర్షి మీద ఉన్న క్రేజ్ నేప‌థ్యంలో ఈ సినిమా టికెట్ల ధ‌ర‌ల్ని  మొద‌టి వారం రోజులు పెంచుకునేందుకు వీలుగా హైకోర్టు థియేట‌ర్ల యాజ‌మాన్యాల‌కు అనుమ‌తి ఇచ్చింది.
దీనిపై సాధార‌ణ ప్రేక్ష‌కుల్లో విప‌రీతమైన ఆగ్ర‌హం వ్య‌క్త‌మైంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఒక థియేట‌ర్ క‌క్కుర్తిపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. కోర్టు వారం పాటు రేట్లు పెంచుకోవ‌టానికి అవ‌కాశం ఇచ్చిన‌ప్ప‌టికీ.. హైద‌రాబాద్ లోని తార్నాక వ‌ద్ద ఉన్న ఆరాధ‌న థియేట‌ర్లో ఇప్పుడు కూడా ఎక్కువ రేట్ల‌ను టికెట్లు అమ్ముతున్నారు.

ఈ ఉదంతంపై బొగ్గుల శ్రీ‌నివాస్ అనే వ్య‌క్తి ఉస్మానియా వ‌ర్సిటీ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ప్రాధ‌మిక విచార‌ణ‌జ‌రిపారు. టికెట్ల‌ను ఎక్కువ ధ‌ర‌ల‌కు అమ్మిన వైనాన్ని గుర్తించారు.  దీంతో ఏపీ సినిమా రెగ్యులేష‌న్ యాక్ట్ కింద ఆరాధ‌న థియేట‌ర్ మీద కేసును పోలీసులు నమోదు చేశారు.  చ‌ట్ట‌బ‌ద్ధంగా పెంపును కోర్టు చెప్పిన‌ట్లుగా వారానికి ప‌రిమితం చేయ‌కుండా అత్యాశ‌కు పోయిన దానికి త‌గిన మూల్యం చెల్లించిన‌ట్లే.


Tags:    

Similar News