నిన్ననే హైదరాబాద్ లోని సూత్రధార్ యాక్టింగ్ స్కూల్ నిర్వాహకుడు అయిన వినయ్ వర్మను లైంగిక వేదింపులు మరియు అమ్మాయిల బ్లాక్ మెయిలింగ్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెల్సిందే. ఆ విషయం మరవక ముందే ముంబయిలో మరో వ్యవహారం బయటకు వచ్చింది. ముంబయికి చెందిన కాస్టింగ్ డైరెక్టర్ సిద్దార్థ్ సరోడ్ ను పోలీసులు అరెస్ట్ చేశాడు. అమాయకపు అమ్మాయిలను బుట్టలో వేసుకుని అవకాశాలు ఇప్పిస్తానంటూ మోసం చేయడంతో పాటు, వారి నుండి డబ్బు లాగడం, వారిని వాడుకోవడం చేస్తున్నాడంటూ సిద్దార్థ్ పై కేసు నమోదు అయ్యింది.
బాధితురాలి నుండి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు సిద్దార్థ్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునేందుకు పక్కా ప్లాన్ వేశారు. ఒక అమ్మాయిని అవకాశాల కోసం అంటూ పంపించి, డబ్బు ఆశ చూపించి సిద్దార్థ్ ను పట్టుకున్నారు. అతడిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా పోలీసులకు అతడు చిక్కకుండా తప్పించుకు తిరిగాడు. ఎట్టకేలకు సిద్దార్థ్ చిక్కాడు. ఈ నేపథ్యంలో అతడిని విచారిస్తున్న నేపథ్యంలో పలు విషయాలు బయటకు వస్తున్నాయి.
సినిమాపై ఆసక్తి ఉన్న అమ్మాయిలను వెదికి పట్టుకుని వారితో పరిచయాలు పెంచుకోవడం, తనకు సినిమా పరిశ్రమలో ఉన్న పరిచయాలను చెప్పి వారిని లోబర్చుకోవడం చేస్తుంటాడు. ఆఫర్లు ఇప్పిస్తా ఫొటోలు పంపించమంటూ అడిగి, వాటిని మార్ఫింగ్ చేసి ఆ తర్వాత బ్లాక్ మెయిల్ కు పాల్పడతాడు. తాను చెప్పినట్లుగా వినకుంటే అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేయడం ఇతడికి అలవాటు. ఎనిమిది మంది అమ్మాయిలు ఇతడి వల్ల ఇబ్బందులు పడ్డారట. లైంగికంగా వేదించడంతో పాటు, అమ్మాయిల నుండి డబ్బును లాగడం కూడా ఇతడు చేసే పని. కాస్టింగ్ డైరెక్టర్ గా పలు సినిమాలకు చేసిన కారణంగా ఇతడిని చాలా మంది అమ్మాయిలు నమ్మి మోసపోయారు. ముంబయి బాంద్రాకు చెందిన పోలీసులు సిద్దార్థ్ ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.