ఎప్పుడూ గ్లామరేనా.. వేరేవి ఇవ్వండి

Update: 2016-03-23 19:30 GMT
కేథరిన్ థ్రెసా.. చమ్మక్ చల్లో అనే మూవీతో పరిచయమైనా.. తెలుగులో ఇద్దరమ్మాయిలతో చిత్రం ద్వారా గుర్తింపు సంపాదించింది ఈ మలయాళీ భామ. ఈ భామకు పెర్ఫామెన్స్ రోల్స్ చేయాలనే కోరిక విపరీతంగా ఉంది. ఇందుకోసం మరీ డీగ్లామర్ రోల్ కాకపోయినా.. పక్కింటి అమ్మాయి లాంటి ఇమేజ్ ఉన్న పాత్రల్లోనూ నటించింది. తమిళ్ మెడ్రాస్ మూవీ ఈ బాపతు చిత్రమే.

అయితే... తనను గ్లామర్‌కే వాడుకుంటున్నారని తెగ ఫీలవుతోంది క్యాథరిన్ థ్రెసా. అందాల ఆరబోతకు సంబంధించిన సినిమాలే వస్తున్నాయన్నది ఈమె బాధ. మెడ్రాస్ తర్వాత తనకు నటనకు అవకాశం ఉన్న పాత్రలు వస్తాయని ఆశించినట్లు చెప్పుకొచ్చింది ఈ సుందరి. అయితే ఆ తర్వాత కూడా తనకు అన్నీ గ్లామర్ రోల్సే వస్తున్నాయంటోంది కేథరిన్. ఆ తరువాత విశాల్ సరసన కథకళి - అధర్వతో కణిదన్ చిత్రాల్లో నటించింది.  ఆ సినిమాలు సక్సెస్ సాధించినా ఈ భామ గ్లామర్‌ డాల్ పాత్రలకే పరిమితం కావడంతో నిరాశ చెందినట్లు చెబుతోంది. తనను దర్శక నిర్మాతలు గ్లామర్‌కే వాడుకుంటున్నారన్నది ఈమె వాదన. మోడ్రన్  పేరుతో పొట్టి పొట్టి డ్రస్సులో కనిపించమంటున్నారని అంటోంది కేథరిన్. గ్లామరస్ పాత్రలతో అభిమానులు పెరుగుతున్నారని.. ఈ విషయంలో సంతోషంగానే ఉన్నా మరీ అలాంటి పాత్రలకే పరిమితం కావడం మాత్రం బాధగా ఉందట.

ఎన్ని సినిమాలు చేశామని కాకుండా..  ఎంత మంచి పాత్రలు పోషించానన్నదే తన లక్ష్యమని.. అలాంగి రోల్స్ కోసం ఎదురు చూస్తున్నానని క్యాథరిన్ థ్రెసా అంటోంది. యాక్టింగ్ కు అవకాశం ఉన్న పాత్రలు వస్తే తన ట్యాలెంట్ చూపిస్తానని కూడా చెబుతోంది.
Tags:    

Similar News