టాప్ స్టోరి: ఈ సెల‌బ్రిటీల‌కు ఎన్ని క‌ష్టాలు?

Update: 2019-11-25 01:30 GMT
సెల‌బ్రిటీల‌కు అన్నీ అందుబాటులో ఉంటాయి. ఏ క‌ష్టం తెలియ‌ద‌ని అనుకుంటారు. కానీ వాస్త‌వం వేరుగా ఉంటుంద‌నేది కొంద‌రికే తెలిసిన స‌త్యం. భారీ పారితోషికాలు.. సంపాద‌న ఉన్నా.. అన్నీ అందుబాటులో ఉన్నా.. స‌క‌ల సౌక‌ర్యాలు అనుభ‌విస్తున్నా.. ఎవ‌రి క‌ష్టాలు వాళ్ల‌కు ఉంటాయ‌నేందుకు ఇదిగో ఈ డేటా ప‌రిశీలిస్తే చాలు. సెల‌బ్రిటీల్లో చాలా మందికి క్యాన్స‌ర్లు.. ట్యూమ‌ర్లు.. లివ‌ర్ సంబంధిత స‌మ‌స్య‌లు స‌హా ప‌లు ఆరోగ్య స‌మ‌స్య‌లు ఉన్నాయ‌న్న రిపోర్ట్ ఆశ్చ‌ర్యం క‌లిగించ‌కుండా ఉండ‌దు.

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ సుదీర్ఘ కాలంగా ఆరోగ్య స‌మ‌స్య‌ల్ని ఎదుర్కొంటున్నారు. టీబీ.. లివ‌ర్ సిర్రోసిస్ లాంటి స‌మ‌స్య‌లు అమితాబ్ ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్నాయి. ఇక ఇప్పుడున్న స్టార్ల‌లో చాలా మంది క్యాన్స‌ర్ల బారిన ప‌డిన వారే.  త‌న‌దైన అందం .. రూప‌లావ‌ణ్యంతో గొప్ప ఫాలోయింగ్ ని సంపాదించిన సీనియ‌ర్ నాయిక  మనీషా కొయిరాలా - క్యాన్సర్ తో పోరాడి నెగ్గారు. బాలీవుడ్ స‌హా సౌత్ ని ఏలిన టాప్ హీరోయిన్ సోనాలి బెంద్రే - క్యాన్సర్ కు ట్రీట్మెంట్ తీసుకున్నారు.  సోనాలి బింద్రే త‌ర‌హాలోనే గాయ‌ని కం న‌టి మ‌మ‌తా మోహ‌న్ దాస్- రొమ్ము క్యాన్స‌ర్ కి చికిత్స తీసుకోవాల్సి వ‌చ్చింది. ఇటీవ‌లే బాలీవుడ్ క్రేజీ హీరో ఇర్ఫాన్ ఖాన్ - న్యూరో ఇంండోక్లైన్ ట్యూమ‌ర్ కి విదేశాల్లో చికిత్స తీసుకున్నారు.

యాక్ష‌న్ గ‌న్ అజయ్ దేవ్‌గన్ కి లిటరల్ ఎపికొండైలిటిస్ (తీవ్రమైన భుజం వ్యాధి) అనే అరుదైన స‌మ‌స్య ఉంది. స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ - గుండెపోటును ఎదుర్కొన్నారు. కండ‌ల హీరో హృతిక్ రోషన్ - బ్రెయిన్ క్లాట్ కి ఇంత‌కుముందు చికిత్స పొందారు. హృతిక్ తండ్రి.. అగ్ర నిర్మాత  రాకేశ్ రోషన్ - గొంతు క్యాన్సర్ కి చికిత్స పొందారు. స్టార్ డైరెక్ట‌ర్ అనురాగ్ బసు - రక్త క్యాన్సర్ బారిన ప‌డి చికిత్స పొందుతున్నారు. అందాల న‌టి  ముంతాజ్ - రొమ్ము క్యాన్సర్ కి గుర‌య్యారు.  

ఇక కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ఏకంగా ఎనిమిది శస్త్రచికిత్సలు తీసుకోవ‌డం హాట్ టాపిక్ అయ్యింది అప్ప‌ట్లో. మోకాలు- మోచేయి- భుజం త‌దిత‌ర చోట్ల శ‌స్త్ర చికిత్స‌లు చేశారు.  తాహిరా కశ్యప్ (ఆయుష్మాన్ ఖురానా భార్య) - క్యాన్సర్ బారిన ప‌డ‌డం విదేశాల్లో ట్రీట్మెంట్ తీసుకోవ‌డం తెలిసిందే.

లీసా రే -  రాజేష్ ఖన్నా - వినోద్ ఖన్నా -  నర్గిస్ -  ఫిరోజ్ ఖాన్ - న‌టుడు టోమ్ త‌దిత‌ర సెల‌బ్రిటీలు క్యాన్సర్ బాధితులు. ఏళ్ల త‌ర‌బ‌డి చికిత్స పొందారు. ఇక టీమిండియా ఆట‌గాడు యువ‌రాజ్ సింగ్ గొప్ప ఫామ్ లో ఉన్న టైమ్ లో క్యాన్స‌ర్ ఎంత కొంప ముంచిందో తెలిసిందే. ఆ త‌ర్వాత అత‌డు కెరీర్ నే పోగొట్టుకున్నాడు.

అన్నీ ఉన్నా ఈ రోగాలెందుకు? అంటే డాక్ట‌ర్లు చెప్పేది ఒక్క‌టే. మ‌నిషి ప్ర‌కృతి జీవ‌నానికి దూర‌మైపోయాడు. ఎప్పుడు ఏది తినాలి? ఎప్పుడు ఏది చేయాలి?  ఎలాంటి గాలి పీల్చాలి? ఎలాంటి నీరు తాగాలి? ఇవ‌న్నీ గాలికి వ‌దిలేసాడు. ప‌ర్య‌వ‌సానంగా ఇన్ని ర‌కాల రోగాలు పుట్టుకొస్తున్నాయి. డ‌బ్బు ఉన్నా దాంతో పాటే జ‌బ్బు కూడా రెడీ అవుతోంది. మంచి ఆరోగ్యంతో జీవించాలంటే ప్ర‌కృతి జీవ‌నం ముఖ్యం. అలానే ఒత్తిళ్ల‌ను దూరం చేసుకోవాలి. మంచి పండ్లు తినాలి. ఆరోగ్య‌క‌ర‌మైన క‌ల్తీ లేని ఆహారం తినాలి. అప్పుడే వీట‌న్నిటి నుంచి బ‌య‌ట‌ప‌డే ఛాన్సుంటుంది. ఇక సెల‌బ్రిటీల అతి సున్నిత‌త్వం ర‌క‌ర‌కాల ప్ర‌మాదాల‌కు దారి తీస్తోందన్న‌ది వేరొక స‌ర్వే. అయితే జిమ్ముల్లో నిరంత‌రం క‌స‌ర‌త్తులు చేసేవారికి క్యాన్స‌ర్లు.. బ్రెయిన్ క్లాట్ వ‌స్తున్నాయి క‌దా? అంటే.. అది దైవేచ్చ‌.. పైవాడి ద‌య అని చెబుతున్నారు. దీన‌ర్థం మెడిటేష‌న్.. భ‌క్తి తో కూడుకున్న జీవితం అల‌వ‌రుచుకోవాల‌ని ధార్మిక‌వేత్త‌లు చెబుతున్నారు.
Tags:    

Similar News