తెలుగు చిత్రపరిశ్రమకు కోలుకోలేని షాక్ తగిలింది. దర్శకరత్న దాసరి మరణం టాలీవుడ్ నిర్ఘాంతపోయేలా చేసింది. ఆయన మరణవార్తను చిత్రపరిశ్రమ జీర్ణించుకోలేకపోయింది. కొద్ది నెలల క్రితం కిమ్స్ లో చికిత్స సమయంలో ఆయన ఆరోగ్యంపై పలు సందేహాలు వ్యక్తమైనా.. ఆయన కోలుకున్న నేపథ్యంలో.. తాజాగా ఆసుపత్రి చేరినప్పుడు కూడా స్వల్ప అనారోగ్యం అనుకున్నారే కానీ.. ఇలా జరుగుతుందని అనుకోలేదని పలువురు వాపోతున్నారు.
దాసరి మరణం.. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భాంత్రికి గురయ్యేలా చేసింది. ఆయన మృతికి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు.. కేసీఆర్ లు తమ తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు.. సుజనా చౌదరి.. ఏపీ రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్.. శిద్దా రాఘవరావు.. తెలంగాణ రాష్ట్ర మంత్రులు కడియం శ్రీహరి.. జగదీశ్ రెడ్డి.. ఎంపీ డి శ్రీనివాసరావు తదితరులు ఆయనకు సంతాపాన్ని తెలిపిన వారిలో ఉన్నారు.
సినీ రంగంలో ఎంతో మందిని ప్రోత్సహించి.. మరెంతో మందికి లైఫ్ ఇచ్చిన దాసరి ఇక లేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమను మద్రాసు నుంచి హైదరాబాద్‌కు తీసుకురావటంలో దాసరి కృషి మర్చిపోలేనిదిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. దాసరి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
తనకంటూ ఒక విశిష్టతను.. ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి దాసరి అంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలు అందించారని.. ఎన్టీఆర్ తో పలు సినిమాలు చేసిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. దాసరి.. ఆయన సతీమణి దివంగత పద్మ తనను ఓ కుటుంబ సభ్యుడిగా తనను చూసే వారన్నారు.
దాసరి మరణం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తీరనిలోటుగా వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నట్లుగా వెల్లడించారు.
దాసరి మరణం తీరని లోటని.. ఆయన ఆకస్మిక మరణం తనను విషాదానికి గురి చేసినట్లు ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు.
చిత్రపరిశ్రమ గొప్ప వ్యక్తిని కోల్పోయిందని.. వ్యక్తిగతంగా తానొక ఆత్మీయుడ్ని కోల్పోయినట్లుగా ప్రముఖ నటుడు.. రచయిత గొల్లపూడి మారుతిరావు చెప్పారు.
మహా మనిషి.. మనసున్న గొప్ప వ్యక్తి దాసరి అని నటుడు కోటా శ్రీనివాసరావు అన్నారు. ఎవరికి కష్టం వచ్చినా తాను ఉన్నానని భుజం తట్టి చేదోడుగా నిలిచేవారన్నారు.
దాసరి మరణం తనను షాకింగ్‌కు గురి చేసినట్లుగా ప్రముఖ హీరో మహేశ్ బాబు ట్వీట్ చేశారు. ఆయన స్థానాన్ని పూరించటం సాధ్యమయ్యే పని కాదని.. దాసరి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు దాసరి మరణం తీరని లోటని.. ఆయన ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుంటూ నందమూరి కల్యాణ్ రాం ట్వీట్ చేశారు. లెజెండ్ దాసరి మరణాన్ని తాను జీర్ణించుకోలేకపోతున్నానని.. తానెప్పటికీ ఆయన్ను మర్చిపోలేనని నటి రకుల్ ప్రీత్ సింగ్ పేర్కొన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/