దాస‌రిని చూసేందుకు తార‌లు దిగి వ‌చ్చారు

Update: 2017-05-31 09:11 GMT
ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రిని క‌డ‌సారి చూసేందుకు తార‌లు దిగి వ‌చ్చారు. చిన్నా.. పెద్ద అన్న తేడా లేకుండా అంద‌రూ ఆయన ఇంటి ముందు క్యూ క‌ట్టారు. దాస‌రితో త‌మ‌కున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటే.. మ‌రికొంద‌రు శాశ్విత నిద్ర‌లోకి జారుకున్న దాస‌రిని అలానే చూస్తుండిపోవ‌టం క‌నిపించింది.

నంద‌మూరి హ‌రికృష్ణ‌.. దాస‌రిని త‌దేకంగా చూస్తుండిపోయారు. పువ్వుల‌తో నివాళులు అర్పించిన అనంత‌రం.. కాస్త ముందుకు వ‌చ్చి.. దాస‌రిని అలా చూస్తూ ఉండిపోవ‌టం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఆ చూపుల్లో దాస‌రి త‌న‌కెంత ఆఫ్తుడ‌న్న విష‌యాన్ని హ‌రికృష్ణ చెప్ప‌క‌నే చెప్పేసిన‌ట్లుగా చెప్పాలి. క‌డ‌సారి చూడాల‌ని మ‌న‌సులో ఉన్నా.. త‌న‌ను తాను కంట్రోల్ చేసుకోలేక‌పోవ‌టం.. లేనిపోని ర‌ద్దీకి కార‌ణం కాకూడ‌ద‌న్న ఉద్దేశంతో దూరంగా ఉండే ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా వ‌చ్చారు. దాస‌రి మ‌ర‌ణం త‌న‌కు వ్య‌క్తిగ‌తంగా తీర‌ని లోటుగా అభివ‌ర్ణించారు. త‌న చిన్న‌త‌నం నుంచి దాస‌రి అంటే త‌న‌కు చాలా ఇష్ట‌మ‌ని.. త‌న‌కిష్ట‌మైన ద‌ర్శ‌కుల్లో దాస‌రి ఒక‌రుగా ప‌వ‌న్ చెప్పారు.

ప‌వ‌న్ వెంట ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ఉన్నారు. దాస‌రిని క‌డ‌సారి చూసేందుకు జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. అల్లు అర్జున్‌.. ప్ర‌కాశ్ రాజ్‌.. బ్ర‌హ్మానందం.. కృష్ణ‌.. ప‌రుచూరి సోద‌రులు.. ఇలా ఒక‌రేమిటి.. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా సినీ.. రాజ‌కీయ రంగాల‌కు చెందిన ప‌లువురు వ‌చ్చారు.

దాస‌రిపార్థిపదేహానికి ద‌గ్గ‌ర‌గా మంచు మ‌నోజ్ ఉండి.. ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షించ‌టం క‌నిపించింది. ఇక‌.. మంచు ల‌క్ష్మి ట్వీట్ ద్వారా తానెంత ఆవేద‌న‌లో ఉన్న విష‌యాన్ని వెల్ల‌డించారు. దాస‌రి ఒక శ‌క్తి అని.. ద‌ర్శ‌క‌ర‌త్న మ‌ర‌ణం మీద స్పందించాల‌ని కోరుతున్నార‌ని.. కానీ తాను స్పందించే ప‌రిస్థితుల్లో లేన‌ని.. త‌న‌ను అర్థం చేసుకోవాల‌ని ఆమె ట్వీట్ చేశారు. దాస‌రిని చూసేందుకు యావ‌త్ సినీ ప‌రిశ్ర‌మ క‌దిలి వ‌చ్చింద‌న‌టంలో అతిశ‌యోక్తి లేద‌ని చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News