‘‘దర్శక వంశానికి దాసరి నారాయణ రావుగారు గుర్తింపు.. గౌరవం తీసుకొచ్చారు. ఆయన స్థానం భర్తీ చేయలేనిది. మొత్తం పరిశ్రమకు ఆయన ‘గురువు గారు’. ఆయన లేకపోవడం అందరికీ పెద్ద లోటు’’
-రాజమౌళి
‘‘దాసరి గారి మరణం తెలుగు చిత్రసీమకు తీరని లోటు. తెలుగు సినిమా గమనానికి సరికొత్త దారి చూపిన దాసరి గారి మరణం తెలుగు చిత్రసీమకు తీరని లోటు. ఆయన మరణానికి చింతిస్తూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తున్నాను.
-నందమూరి బాలకృష్ణ
‘‘తెలుగు చిత్ర కళామతల్లి కన్న ఒక దిగ్గజం ఇక లేదు. మరవదు పరిశ్రమ మీ సేవలను. దాసరి నారాయణరావు ఆత్మకు శాంతి చేకూరాలి’’
-జూనియర్ ఎన్టీఆర్
‘‘రచయిత.. దర్శకుడు.. నిర్మాత.. నటుడు.. సంపాదకుడు.. బహుముఖ ప్రతిభాశాలి.. దాసరి గారి అస్తమయం.. తెలుగువారికి తీరని లోటు’’
-హరీష్ శంకర్
‘‘కుల.. మత.. లింగ.. బడుగు.. బలహీన వర్గాలు అనే తేడా లేకుండా సినీ రంగంలోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరినీ ప్రోత్సహించి.. సినిమా రంగంలో జీవితాన్నిచ్చిన గొప్ప వ్యక్తి దాసరి నారాయణరావు. దాసరి సినీరంగంలో అంబేద్కర్ లాంటివారు’’
-ఆర్.నారాయణమూర్తి
‘‘అసలు మాటలు రావడం లేదు. నేను ఇంకా షాక్ లోనే ఉన్నాను. దాసరి గారు ఇకలేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆయన ఓ గొప్ప దార్శనికుడు. ఆయన లేని లోటును ఎవరూ పూడ్చలేరు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవున్ని ప్రార్థిస్తున్నా’’
-విజయశాంతి
‘‘పెద్ద దిక్కును కోల్పోయాం ఒక తెలుగు దర్శకుడిగా అన్ని 151 చిత్రాలకు దర్శకత్వం వహించి దర్శకుడే కెప్టెన్ అని నిరూపించిన వ్యక్తి దాసరిగారు. ఇండస్ట్రీలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ముందు అండగా నిలబడే వ్యక్తి కూడా ఆయనే. తెలుగు చిత్రసీమకు ఆయన చేసిన కృషి మాటల్లో చెప్పలేం. దాసరిగారి దర్శకత్వంలో అహంకారి అనే సినిమాను చేశాను. ఆ సినిమా సమయంలో ఆయనతో చేసిన జర్నీ మరచిపోలేను. ఆయన మా కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉండేవారు. మా కుటుంబ పెద్దను కోల్పోయాం. దాసరి వంటి దర్శకుడు మళ్ళీ రాడు.. రాలేడు’’
-రాజశేఖర్-జీవిత
‘‘అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుని చాలా త్వరగా కోలుకుని మళ్లీ ఇంటికొచ్చారు. ఇటీవలే అభిమానుల సమక్షంలో ఘనంగా పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. ఇంతలోనే దాసరి గారి గురించి పెను విషాదం లాంటి వార్తను వినాల్సి వచ్చింది. ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు. ‘మా’ టీమ్ అందరికీ పెద్ద దిక్కులా ఉండే వ్యక్తిని మేం కోల్పోయాం. తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో సేవలందించిన వ్యక్తి. దర్శక దిగ్గజం లేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నాం’’
- మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజా- జనరల్ సెక్రటరీ నరేష్
‘‘దర్శక ద్రోణాచార్యుడు దాసరి గారు మా మధ్య లేరనే వార్త నా మనసును కలచివేసింది. ఆయన మరణం తెలుగు సినిమాకి తీరని లోటు. ఆయన చూపిన బాటలో మా దర్శకులందరం నడిచి.. ఆయన ఆశయాన్ని నెరవేరుస్తాం’’
-బోయపాటి శ్రీను
ఇండస్ట్రీ ఎదుగుదల కోసం అనునిత్యం ఆరాటపడిన వ్యక్తి దాసరి గారు, అలాంటి మనిషి మన మధ్య లేకపోవడం బాధాకరం.
-నారా రోహిత్
‘‘ఆయన దర్శక దిగ్గజం మాత్రమే కాదు. తెలుగు సినిమాకు మణిహారం. ఆయన లాంటి గొప్ప వ్యక్తి ఇక లేరనే వార్త మింగుడుపడడం లేదు.
-దర్శకుడు చందు మొండేటి
‘‘చిన్నాపెద్దా అనే తేడా లేకుండా టాలెంటుని ఎంకరేజ్ చేసిన మహోన్నత మనస్తత్వం కలిగిన వ్యక్తి దాసరి నారాయణరావు గారు. ఆయన మరణానికి చింతిస్తూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’’
-దర్శకుడు సుధీర్ వర్మ
‘‘సునామీ వస్తే ప్రజలు ఎలా అయిపోతారో.. దర్శక దిగ్గజం దాసరి లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేక సినీ ఇండస్ట్రీ అలా అయిపోతోంది. ఇండస్ట్రీలో కార్మికుల నుంచి దర్శకులు.. నిర్మాతలకు సమస్యలు వచ్చినా నిమిషాల్లో పరిష్కరించే వ్యక్తి దాసరి’’
-శివకృష్ణ
‘‘ఒక దర్శకుడిగా నాకు దార్శనికుడు.. తెలుగు చిత్రసీమకు మార్గ దర్శకుడు దర్శకరత్న దాసరి గారి మరణం మాకు తీరని లోటు’’
-దర్శకుడు శ్రీవాస్
‘‘ఒక దర్శకుడిగా.. ఇండస్ట్రీ పెద్దగా దాసరి గారి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు’’
-హీరో గోపీచంద్
‘‘దర్శకరత్న దాసరిగారి మరణం తెలుగు చిత్రసీమకు తీరని లోటు. నిర్మాత క్షేమం కోరే ఆయన లాంటి వ్యక్తి మరణం జీర్ణించుకోవడం కష్టం’’
-సాయి కొర్రపాటి
‘‘మా దర్శకులందరికీ పెద్ద దిక్కులాంటి దాసరి గారు శారీరకంగా మన మధ్య లేకపోవచ్చు, కానీ ఆయన ఆశయాలు మాత్రం ఎప్పటికీ మమ్మల్ని నడిపిస్తూనే ఉంటాయి’’
-దర్శకుడు సంపత్ నంది
‘‘దాసరి గారు భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు. కానీ ఆయన సాధించిన ఘనతలు..తెలుగు సినిమాకు తీసుకొచ్చిన గౌరవం చిరస్మరణీయం’’
-పీవీపీ
‘‘మాలాంటి యువ నటులందరికీ స్ఫూర్తి అయిన దాసరి గారి మరణం మాకు తీరని లోటు’’
-విజయ్ దేవరకొండ
‘‘తెలుగు సినిమా రొమ్ము విరుచుకొని నిలబడేలా చేసిన దార్శనికుడు దాసరి గారు మరణించడం మా దర్శకులందరికీ తీరని లోటు’’
-దర్శకుడు ఎన్.శంకర్
‘‘స్టార్ డమ్ నటులకు మాత్రమే సొంతం కాదని రుజువు చేసి.. దర్శకుడి పేరు పోస్టర్ పైకి తెచ్చిన మహనీయుడు దాసరి. ఆయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటు’’
-దర్శకుడు తేజ
‘‘తెలుగువాడి సత్తాను ప్రపంచానికి పరిచయం చేసి.. దర్శకుడి స్థాయిని పెంచిన దర్శకరత్న దాసరి మరణం నన్ను ఎంతో బాధిస్తోంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకొంటున్నాను’’
-శర్వానంద్
‘‘ఇండస్ట్రీకి మాత్రమే కాదు మా కుటుంబానికి కూడా పెద్ద దిక్కు లాంటి దాసరి గారి మరణం మాకు తీరని లోటు’’
-మంచు విష్ణు.. మంచు మనోజ్
‘‘నేను తీసిన మొదటి సినిమాకి మొదటి అభినందన దక్కింది దాసరి గారి నుంచే. అలాంటి వ్యక్తి మరణం నన్ను చాలా బాధించింది.
-దర్శకుడు క్రాంతి మాధవ్
‘‘ఒక నటుడిగా.. ఒక దర్శకుడిగా.. ఒక వ్యక్తిగా నాపై దాసరి గారి ప్రభావం చాలా ఉంటుంది. అలాంటి మనిషి మరణ వార్త నన్ను ఎంతగానో బాధించింది’’
-రవిబాబు
‘‘నన్ను నటుడిగా ఆదరించి ఆశీర్వదించిన అతి తక్కువ మంది వ్యక్తుల్లో దాసరి గారు ప్రథములు. అటువంటి గొప్ప మనిషి మరణం ఇండస్గ్రీకి తీరని లోటు’
-నటుడు శ్రీవిష్ణు
‘‘నా సినిమాల్లో తెలుగుదనం ఎక్కువగా ఉండాలనే ఆలోచన దాసరి గారి వల్లనే వచ్చింది. ఆయన సినిమాలు నాపై చూపిన ప్రభావం అలాంటిది. అలాంటి వ్యక్తి మరణం నన్ను కలచివేసింది’’
-మోహనకృష్ణ ఇంద్రగంటి