ఐశ్వర్య సీన్లన్నీ కట్ చేయాల్సిందేనట

Update: 2016-10-13 15:30 GMT
అసలు ఒక అమ్మాయికంటే ఓ 10 ఏళ్ళ చిన్నవాడు ఆమెను ప్రేమిస్తే ఆ ప్రేమకథ ఎలా ఉంటుంది? ఇలాంటి మెట్యూర్డ్ ప్రేమకథను చాలాసార్లు చాలామంది డీల్ చేశారు. కాని అందరికంటే బాగా ఇప్పుడు కరణ్‌జోహార్ డీల్ చేస్తున్నాడు. మనోడు ఈ నెల 28న రిలీజ్ చేస్తున్న ''ఏ దిల్ హై ముష్కిల్'' అనే సినిమాలో డీల్ చేసిన కథ ఇదే. ట్రైలర్ చూస్తే ఆ విషయం మనకు అర్దమవుతోందిగా.

ఇకపోతే సినిమాను ప్రశంసించిన సెన్సార్ బోర్డు వారు.. ఈ సినిమాలో కట్స్ తప్పవు అంటూ చెప్పడంతో కరణ్‌ జోహార్ చాలా టెన్షన్ పడుతున్నాడని అంటున్నారు. ఎందుకంటే ఐశ్వర్యతో ప్రేమాయణం ఓకె కాని.. ఐష్‌ అండ్ రణబీర్ మధ్యన జరుగుతున్న రొమాన్స్ మాత్రం బాలేదు అన్నారట. పైగా ఆ సీన్లన్నీ ఎలాగైనా కూడా కట్ చేయాల్సిందే అనే చెప్పడంతో ఇప్పుడు ఐష్‌ అభిమానులు అందరూ ఫుల్ ఖుషీగా ఉన్నా కూడా.. రణబీర్ ఫ్యాన్స్ మాత్రం హర్టయిపోతున్నారు. ఇకపోతే కరణ్‌ ఎలాంటి విధంగా ఆ సీన్లను చూపిస్తాడో చూడాలి.

ఇప్పటికే విడుదలైన బుల్లాయా అనే సాంగు ఒక్కటే కాదట.. అసలు ఐష్‌ తో రణబీర్ చేసిన స్టీమీ రొమాన్స్ ఇంకో సాంగులో ఉందట. ఆ పాటను పూర్తిగా మార్చాలని చెప్పినట్లు తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News