మామూలుగా రియల్ లైఫ్ లో చాలామంది తమకంటే వయస్సులో పెద్దవారిని పెళ్లి చేసుకుంటున్నారు. అదేనండీ.. వయస్సులో చిన్నవారైన అబ్బాయిలు పెద్ద వయస్సు అమ్మాయిలను పెల్ళాడుతున్నారు. అలా చేయకూడదని రూల్ ఏమీ లేదు. అయితే ఇదే విషయాన్ని వెండితెరపై కాస్త ఎరోటిక్ టచ్ తో చూపిస్తే మాత్రం సెన్సార్ బోర్డు వారు ఒప్పుకోవట్లేదు. రియాల్టీ చెప్పడానికి వారికి అంత బాధేంటో మరి.
నిజానికి 'ఏ దిల్ హై ముష్కిల్' సినిమాలో వయస్సులో తనకంటే పెద్దదైనా ఐశ్వర్యతో ప్రేమలో పడతాడు రణబీర్. పైగా వీరి మధ్యన కెమిస్ర్టీ ఓ రేంజుకు వచ్చేశాక.. ''నేను వయస్సులో పెద్దదాన్ని.. అలాగే అనుభవంలోనూ పెద్దదాన్నే'' అంటూ ఐష్ ఒక డైలాగ్ చెప్పిందట. ఇప్పుడు సెన్సార్ బోర్డు వారు.. కేవలం ఆ డైలాగును మ్యూట్ చేయడం లాంటివి కాకుండా.. ఏకంగా డైలాగ్ అండ్ విజువల్స్ కూడా తీసేయమన్నారు. వయస్సుంది అనుభవం ఉంది అంటూ ఐష్ చెబుతుంటే.. అది విని పిల్లలు పాడైపోతారని సెన్సార్ బోర్డు వారు ఫీలయ్యారు కాబోలు.
అందుకే ఐష్ కు అన్నీ ఉన్నా కూడా.. ఈ సినిమాలో ఆ డైలాగ్ ప్రజల చెవున పడేలా చెప్పడానికి పర్మిషన్ మాత్రం లేదు. అంతేకాదండోయ్.. సినిమాలోని అసలు ఐష్ అండ్ రణబీర్ మధ్యన లిప్పు లాకులు కూడా లేవు. వచ్చే శుక్రవారమే ఈ కరణ్ జోహార్ దృశ్యకావ్యం రిలీజవుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/