జాతీయ క్రీడ హాకీ నేపథ్యంలో యంగ్ హీరో సందీప్ కిషన్ - లావణ్య త్రిపాఠి జంటగా రూపొందుతోన్న లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా ''ఏ1 ఎక్స్ ప్రెస్''. డెన్నిస్ జీవన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో హీరో హీరోయిన్లు ఇద్దరూ హాకీ ప్లేయర్స్ గా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ - ట్రైలర్ - సాంగ్స్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. సందీప్ కెరీర్ లో వస్తున్న ఈ 25వ చిత్రాన్ని మార్చి 5న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
సెన్సార్ బోర్డ్ వారు 'ఏ1 ఎక్స్ ప్రెస్' చిత్రాన్ని చూసి క్లీన్ 'యూ' సర్టిఫికేట్ జారీ చేశారు. ఇది హాకీ క్రీడ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఫస్ట్ తెలుగు సినిమా అని చెప్పవచ్చు. క్రీడా వ్యవస్థలో రాజకీయ నాయకుల జోక్యం కారణంగా క్రీడాకారులు ఎలా బలవుతున్నారు అనే విషయాన్ని ఈ సినిమాలో డిస్కస్ చేయబోతున్నట్లు ట్రైలర్ - 'వీధికొక జాతి' సాంగ్ చూస్తే అర్థం అవుతోంది. ఈ సినిమా కోసం సందీప్ సిక్స్ ప్యాక్ చేశారు. అలానే హాకీ పై పట్టు సాధించడం కోసం లావణ్య హాకీ శిక్షణ తీసుకున్నట్లు తెలుస్తోంది.
హిప్ హాప్ తమిజ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. కెవిన్ రాజ్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించగా.. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేశారు. ఈ చిత్రంలో మురళీ శర్మ - రావు రమేష్ - రాహుల్ రామకృష్ణ - మహేష్ విట్టా - ఖయ్యూమ్ - భూపాల్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ - అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ - వెంకటాద్రి టాకీస్ బ్యానర్స్ పై టీజీ విశ్వప్రసాద్ - అభిషేక్ అగర్వాల్ - సందీప్ కిషన్ - దయా పన్నెం కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.