150 కట్స్‌ చెప్పారా? ఐతే షార్ట్‌ ఫిలిమే

Update: 2016-01-11 19:30 GMT
ఈ మధ్య కాలంలో బహుశా సెన్సార్‌ బోర్డుకు షాకిచ్చిన సినిమాల్లో.. ఫస్టు ప్లేసులో ఉండేది సన్నీ లియోన్‌ సినిమా 'మస్తీజాదే' అయితే.. రెండో ప్లేసులో ఉండేది ఇప్పుడొస్తున్న ''క్యా కూల్‌ హయ్‌ హమ్‌ 3''. ఏదో పోర్న్‌ సినిమాల్లో బట్టలుండవ్‌.. ఈ సినిమాల్లో బట్టలు వేసుకుంటారు.. అనే తేడా తప్పిస్తే.. మిగతాదంతా సేమ్‌ టు సేమ్‌. పైగా బూతు మాటలూ - చేష్టలు - వల్గర్‌ జోకులు. ఇదే కథనం. మరి సెన్సార్‌ బోర్డు మాత్రం ఏం చేస్తుంది చెప్పండి.

ఉమేష్ గాడ్గె దర్శకత్వంలో ఏక్తా కపూర్ తన తమ్ముడు తుషార్‌ హీరోగా నిర్మించిన సెక్స్-కామెడీ సినిమా క్యా కూల్‌ హాయ్‌ హమ్‌ 3 కు ఏకంగా 150 కట్ లు వేయాలని సెన్సార్ బోర్డు సూచించినట్టు తెలుస్తోంది. దర్శక - నిర్మాతలు ఈ ఊహించని పరిణామానికి కంగుతిన్నారు. సెన్సార్ బోర్డు ఆదేశాల ప్రకారం కేకేహెచ్ హెచ్ 3కు 150 కట్ లు వేస్తే.. ఈ సినిమా కాస్తా షార్ట్ ఫిలింలా అయిపోతోందని వారు ఏడుస్తున్నారు. మరి సినిమాను టోటల్‌ గా ఇరిటేటింగ్‌ పోర్న్‌ సినిమాలా తీస్తే కట్స్‌ వేయక ఏం చేస్తాం అంటున్నారు సెన్సార్‌ వర్గాలు.

ముఖ్యంగా హీరోలు చేసిన డబుల్‌ మీనింగ్‌ స్టంటులు.. ఇరానియన్‌ బ్యూటి మందన కరిమి ఆరబోసిన బీభత్సమైన బికినీ అందాలు.. 'ఎ' కాదు కదా.. ఎ++ ఇచ్చినా కూడా జస్టఫై చేయడం కుదరదట. చూద్దాం చివరకు ఏమవుతుందో...
Tags:    

Similar News